Indiramma Housing Scheme | నిరుపేదలు తమ సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించే ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గతంలో ప్రజాపాలన (Praja Palana) లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని వర్తింపజేయనున్నారు.
ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ దశల వారీగా ఈ పథకం వర్తింపజేయనున్నారు. స్థలం ఉండి ఇల్లు లేనవారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అయితే స్థలం కూడా లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి వివిధ రకాల ఇంటి మోడల్ డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. ఈ మోడల్ లో తప్పనిసరిగా ఒక వంట గది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ మోడల్ ను తీర్చిదిద్దారు. మొదటి విడతలతో అన్ని 90 వేలకు పైగా లబ్ధిదారులను గుర్తించారు.
అర్హులు ఎవరంటే..
- లబ్ధిదారుడు తప్పనిసరిగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి.
- రేషన్ కార్డు కలిగి ఉండాలి
- లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి. లేదా ప్రభుత్వం స్థలం మంజూరు అయి ఉండాలి.
- అద్దె ఇంట్లో ఉంటున్న నిరుపేదలు కూాడా అర్హులే..
- గుడిసె, గడ్డితో పై కప్పును నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన తాత్కాలిక ఇల్లు ఉన్నవారు కూడా ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు.
- వివాహమైనా.. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా కూడా లబ్ధిదారుడిగా ఎంపిక చేస్తారు.
- ఒంటరి మహిళ, వితంతులు కూడా లబ్ధిదారులే.. .
- లబ్ధిదారుడు గ్రామం లేదా మున్సిపాలిటీ పరిధి లో ఉండాలి.
Indiramma Housing Scheme లబ్దిదారుల ఎంపిక విధానం
- ఇందిరమ్మ ఇంటిని పేద మహిళల పేరు మీదే అందజేస్తారు.
- గ్రామ సభలు లేదా వార్డుసభల్లో తీర్మానం పొందిన తరువాత లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శిస్తారు. సమీక్షించి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్నతరువాత తుది నిర్ణయం తీసుకుంటారు.
- కలెక్టర్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులకు ఇండ్లను మంజూరు చేస్తారు.
- జిల్లాల్లో కలెక్టర్లు, గ్రేటర్ హైదరాబాద్‌లో కమిషనర్ ఎంపిక చేసిన తనిఖీ బృందాలు లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తాయి.
- లబ్ధిదారుల ఎంపిక తర్వాత జాబితాను గ్రామ, వార్డుసభలో ప్రదర్శిస్తారు.
- 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. RCC రూఫ్ తో ఇంటిని నిర్మించాలి.
డబ్బుల చెల్లింపు ఇలా.
- డబ్బులను ఇంటి నిర్మాణం బట్టి దశల వారీగా డబ్బులు మంజూరు చేస్తారు.
- మెుదటగా పునాధి స్థాయిలో రూ.లక్ష మంజూరు చేస్తారు.
- పైకప్పు నిర్మాణం జరిగేటపుడు మరో రూ.లక్ష అందిస్తారు.
- పైకప్పు నిర్మాణం పూర్తయ్యాక రూ.2 లక్షలు మంజూరు చేస్తారు.
- ఇంటి నిర్మాణం కంప్లీట్ అయ్యాక చివరగా మరో రూ.లక్ష ఇస్తారు. ఈ విధంగా. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 5 లక్షలు జమ చేయనున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..