Saturday, August 30Thank you for visiting

Tag: South Central Railway

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

Trains Cancelled |రక్షా బంధన్‌కు ముందు 72 రైళ్లను రద్దు.. 22 రైళ్ల దారిమ‌ళ్లింపు | పూర్తి వివరాలు

National
Indian Railways | భారతీయ రైల్వే.. మహారాష్ట్రలోని రాజ్‌నంద్‌గావ్ నాగ్‌పూర్ (Nagpur) రైల్వే స్టేషన్‌ల మధ్య మూడవ రైల్వే ట్రాక్‌ను ఏర్పాటు చేస్తున్న కార‌ణంగా వాటి మధ్య ప్రయాణించే 72 రైళ్లను రద్దు చేసింది. ఈ లైన్ నిర్మాణం కోసం రాజ్‌నంద్‌గావ్-కలమ్నా స్టేషన్ మధ్య పెద్ద ఎత్తున ప్రీ-ఇంటర్‌లాకింగ్, ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగ‌కు ముందు 100 రైళ్లు ప్ర‌భావిత‌మ‌వుతున్నాయి. వీటిలో దాదాపు 72 రైళ్లు రద్దు ( Trains Cancelled )కాగా, 22 రైళ్ల‌ను దారిమళ్లించింది. మ‌రో 6 రైళ్ల మార్గాన్ని కుదించింది.ఆగస్టు 4 నుంచి 20 మధ్య రైల్వే యంత్రాంగం ఈ రైళ్లను రద్దు చేసింది. ఆగస్ట్ 19న రక్షాబంధన్ పండుగ ఉన్నందున, ప్ర‌జ‌లు తమ రైళ్ల వివ‌రాల‌ను ముందుగా తెలుసుకోవ‌డం ఉత్త‌మం. రాజ్‌నంద్‌గావ్ - నాగ్‌పూర్ స్టేషన్‌ల మధ్య 228 కి.మీ మూడో లైన్ కనెక్టివిటీ కోసం రైల్వే సుమార...
Bharachalam railway line | తెలంగాణ‌లో మ‌రో కొత్త రైల్వేలైన్ కు గ్రీన్ సిగ్న‌ల్‌..

Bharachalam railway line | తెలంగాణ‌లో మ‌రో కొత్త రైల్వేలైన్ కు గ్రీన్ సిగ్న‌ల్‌..

Telangana
భద్రాచలం నుంచి మల్కన్‌గిరి వ‌ర‌కు ₹4,109 కోట్లతో కొత్త లైన్​ Bharachalam railway line | ప్ర‌యాణికుల‌కు భార‌తీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హ‌ర్షం వ్యక్తం చేశారు. భార‌త్ లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణ‌యించార‌ని తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ స‌మావేశంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివ‌రించారు. . 24,657 కోట్ల అంచ‌నా.. రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్...
Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు

Cherlapalli | చివరి దశకు చర్లపల్లి రైల్వే టెర్మినాల్ పనులు

Telangana
Cherlapalli | హైదరాబాద్: రూ.430 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో పనులు పూర్తవుతాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌ అధికారులు తెలిపారు.పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని కొన్ని రోజుల క్రితం ఉన్నతాధికారులు రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించారు.  హైదరాబాద్‌కు తూర్పు వైపున ఉన్న రైల్వే టెర్మినల్‌ను అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ స్టేషన్ పూర్తయిన తర్వాత 15 అదనపు రైలు సర్వీసులను నిర్వహించగలదని అధికారులు తెలిపారు. ఇది 10 అదనపు లైన్లను నిర్మించారు.. అంతేకాకుండా, రీడెవలప్‌మెంట్ స్టేషన్‌లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్‌ఫారమ్‌లు ఉంటాయి, ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి-నిడివి గల రైళ్లను నిలపడానికి వీలుగా విస్తరించారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ...
Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..

Amrit Bharat Station Scheme | అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న బేగంపేట్ రైల్వే స్టేషన్ ను చూడండి..

Trending News
Begumpet | అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం (Amrit Bharat Station Scheme ) కింద  తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ పనులు  శరవేగంగా సాగుతున్నాయి.. అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్‌లో ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలు కల్పిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.‘‘తెలంగాణలోని బేగంపేట రైల్వే స్టేషన్‌లో ఊహించిన మార్పు రూపుదిద్దుకుంటోంది. ఆధునీకరణ పనులు పూర్తయిన తర్వాత, స్టేషన్ ముందు ద్వారం ఆకర్షణీయంగా కనిపించనుంది , అలాగే ప్రయాణీకులకు అధునాతన  సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి ”అని మంత్రిత్వ శాఖ X లో సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఇది కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.స్టేషన్ కోడ్ BMT కలిగిన బేగంపేట రైల్వే స్టేషన్ లో   రెండు ప్లాట్‌ఫారమ్‌లు, రెండు రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది . ఇది పూర్తిగా విద్యుద్దీకరించబ...
Trains Cancelled  | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..

Trains Cancelled | ప్రయాణికులకు అలర్ట్.. కాచిగూడ స్టేషన్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు..

Telangana
హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ డివిజన్‌ లో ట్రాక్‌ మెయింటెనెన్స్‌ పనుల కోసం ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ డివిజన్ పరిధిలోనూ రైల్వే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో నెలరోజులుపాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు ఈ నెలరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. రద్దయిన రైళ్ల జాబితా..Trains Cancelled From Kachiguda ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గుంతకల్-బీదర్ (07671) మధ్య నడుస్తున్న రైలును రద్దు చేశారు.  ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబరు 1వ తేదీ వరకు బోధన్ నుంచి కాచిగూడ మధ్య నడుస్తున్న (07275) రైలును కూడా రద్దు చేశారు. ఆగస్టు 2-సెప్టెంబర్ 1 కాచిగూడ-గుంతకల్ (07670) ఆగస్టు 1-31 కాచిగూడ-రాయచూర్ (17693) ఆగస్టు 1-31 రాయచూర...
Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Andhrapradesh
Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. స్టేష‌న్ల వివ‌రాలు తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ...
Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..

Ashwini Vaishnaw | రైల్వే బడ్జెట్ 2024లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు ఇవే..

National
Union Budget 2024 | కేంద్ర‌ బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్ల‌డించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్ర‌యాణికుల‌కు భద్ర‌త‌, సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ప్రాధాన్య‌మిచ్చిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్ల‌డిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్ష‌న్ గురించి కూడా వివ‌రాల‌ను పంచుకున్నారు. రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే...
Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Telangana
Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, ...
Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

National, Trending News
Rail News | రైలు ప్రయాణికులకు సంతోషం క‌లిగించేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం త‌గ్గిపోయిన కార‌ణంగా రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించాల‌న్న కార‌ణంతో పలు స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ల హాల్టింగ్ సౌక‌ర్యాన్ని నిలిపివేయాల‌ని నిర్ణయించింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌, ఏపీలో కొన్ని రైల్వే స్టేషన్లను పూర్తిగా మూసేశారు కూడా. మరోవైపు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు గతంలో ఇచ్చిన హాల్టింగ్ గడువు ముగియడంతో రాకపోకలు ఆగిపోతాయని అంద‌రూ భావించారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 69 రైళ్లకు ఆయా స్టేషన్లలో హాల్టింగ్ సౌక‌ర్యాన్ని పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈనెల 29వ తేదీతో మొత్తం 69 రైళ్లకు గతంలో జారీ చేసిన గడువు ముగుస్తోంది.ప్రయాణికుల డిమాండ్ తో ప‌లు రైల్వేస్టేషన్లలో రైళ్లను నిలిపేందుకు అనుమతిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్ల‌డించింది. విజయవాడ మీదుగా రాకపోకలు ...
charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్

charlapalli railway terminal | పూర్తి కావొచ్చిన చర్లపల్లి రైల్వే టెర్మినల్.. జంటనగరాల్లో నాలుగో అతిపెద్ద రైల్వేస్టేషన్

Trending News
హైదరాబాద్ శివారులోని  చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్‌ (charlapalli railway terminal) లో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లించింది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ స్టేషన్ హైదరాబాద్ జంట నగరాల్లో నాలుగవ అతిపెద్ద టెర్మినల్ స్టేషన్‌గా నిలవనుంది. అంతేకాకుండా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి  15  రైళ్లను నడిపించనున్నామని మంత్రిత్వ శాఖ  X లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. మొత్తం 9 ప్లాట్ ఫాంలు charlapalli railway terminal  దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న  ఈ చర్లపల్లి శాటిలైట్ టెర్మినల్ స్టేషన్ (స్టేషన్ కోడ్ - CHZ) లో  తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, 19 రైల్వే ట్రాక్‌లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ జంట నగరాల్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే టర్మినల్స్ ఉండగా అవి నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమం ఆయా స్టేషన్లప...