
భద్రాచలం నుంచి మల్కన్‌గిరి వరకు ₹4,109 కోట్లతో కొత్త లైన్
Bharachalam railway line | ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ లో రైల్వే నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్న ప్రధాని మోదీ నిర్ణయించారని తెలిపారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, ఒడిశా, మహారాష్ట్ర సహా పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని వివరించారు. .
24,657 కోట్ల అంచనా..
రూ.24,657 కోట్ల అంచనా వ్యయంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో కొత్త రైల్వే లైన్లను ఏర్పాటు చేస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇందులో భాగంగా ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలంలోని పాండురంగాపురం వరకు (Bharachalam railway line ) ₹4,109 కోట్లతో 200.60 కి.మీ పొడవుతో కొత్త రైల్వే లైన్‌ను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఈ లైన్ అందుబాటులోకి వస్తే ఏపీ, తెలంగాణ నుంచి తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతుందని మంత్రి సంజయ్ తెలిపారు.
ఏడు రాష్ట్రాలు, 8 కొత్త రైల్వే లైన్లు..
7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను కవర్ చేసే 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టుల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు లబ్ది పొందుతారని రైల్వే మంత్రి అశ్విని వైష్ణమ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని 7 రాష్ట్రాల్లోని 14 జిల్లాలను ఈ 8 కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులు కవర్ చేస్తాయి. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.24,657 కోట్లుగా నిర్ణయించారు. ఈ. 8 ప్రాజెక్టులలో ఒకటి మల్కన్ గిరి-పాండురంగాపురం (భద్రాచలం మీదుగా) 173.61 కిలోమీటర్లు. ఇది తూర్పు గోదావరి, భద్రాద్రి కొత్తగూడెం, మల్కన్‌గిరి (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జిల్లాలను కవర్ చేస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..