ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. విజయవాడ డివిజన్ లో 13 రైళ్ల దారి మళ్లింపు!
Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బదులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా నడిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతుండడంతో మరో మూడు రైళ్లను దారి మళ్లించారు.పూజ సీజన్ నేపథ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల నేపథ్యంలో రెండు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. వి...