
Vijayawada | దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కీలక అప్ డేట్ ఇచ్చింది. విజయవాడ రైల్వే డివిజన్ (Vijayawada Railway Division) పరిధి లో 13 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డివిజన్ లో భద్రతా పనుల కారణంగా 10 రైళ్లు దారి మళ్లించి నడిపిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో రైళ్లు వెళ్లే విజయవాడ- ఏలూరు- నిడదవోలుకు మార్గానికి బదులు.. విజయవాడ- గుడివాడ- భీమవరం టౌన్- నిడదవోలు మీదుగా నడిపిస్తున్నారు. అలాగే పల్వాల్-న్యూ ప్రిథ్లా యార్డ్ మధ్య రైలు కనెక్టివిటీకి సంబంధించి పాల్వాల్ స్టేషన్‌లో ఇంటర్‌లాకింగ్ పనులు చేపడుతుండడంతో మరో మూడు రైళ్లను దారి మళ్లించారు.
పూజ సీజన్ నేపథ్యంలో సంబల్‌పూర్-ఈరోడ్ మధ్య రెండు స్పెషల్ ట్రైన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల నేపథ్యంలో రెండు రైళ్లను రీషెడ్యూల్ చేశారు. విశాఖపట్నం నుంచి న్యూదిల్లీ మధ్య నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805, 20806) రైళ్లు సెప్టెంబర్ 4 నుంచి సెప్టెంబర్ 17 వరకు దారి మళ్లించారు. ఈ ట్రైన్ ఆగ్రా కాంట్-మితావాలి-ఘజియాబాద్-న్యూదిల్లీ మీదుగా ప్రయాణించనుంది.
అలాగే విశాఖపట్నం-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807) రైళ్లు కూడా సెప్టెంబర్ 6, 7, 10, 13, 14వ తేదీల్లో ఆగ్రా కాంట్, మితావాలి, ఘజియాబాద్ మీదుగా న్యూదిల్లీకి మళ్లిస్తారు. సెప్టెంబర్ లో మూడు రైళ్లు విజయవాడ, ఏలూరు, నిడదవోలుకు మార్గానికి బదులుగా మరో మార్గంలో వెళ్లనున్నాయి. ఇవి విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా వెళ్తాయి.
ఎర్నాకులం-పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22643) సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 23 వరకు దారి మళ్లించారు. ఎస్ఎంవీ బెంగళూరు-గౌహతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12509) రైలు వచ్చే నెల 4 నుంచి 27వ తేదీ వరకు దారి మళ్లించిన మార్గంలోనే నడవనుంది. సీఎస్‌టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు (11019) సెప్టెంబర్ నెల 2 నుంచి 29 వరకు దారి మళ్లించారు.
వాల్తేర్ డివిజన్‌లోని పుండి-నౌపడ- పుండి, తిలారు-కోటబొమ్మాళి సెక్షన్‌లలో రైల్వే ట్రాక్ ల పనులు చేపడుతున్న దృష్ట్యా ఆగస్టు 23 తేదీలో పలు రైళ్ల టైమింగ్ లో మార్పులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్ బెంగళూరు – భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18464) ట్రైన్ ను రీషెడ్యూల్ చేశారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..