
Parle-G story: 12 మంది కార్మికులతో మొదలై… రూ.8000కోట్ల విక్రయాలతో ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన బిస్కెట్ బ్రాండ్..
Parle-G Story : కేవలం బిస్కెట్ మాత్రమే కాదు.. ఇది మనతో శాశ్వతమైన అనుబంధం ఏర్పరుచుకున్న చిన్ననాటి జ్ఞాపకాల రుచి. ఉదయం సాయంత్రం వేళల్లో టీ లేదా పాలతో చక్కని కాంబినేషన్, నోటిలో వేసుకోగానే కమ్మనైన టేస్ట్ ఇస్తూ కరిగిపోతుంది. ఐకానిక్ పసుపు రంగు ప్యాకెట్‌పై ముద్దులొలికే చిన్న పాప ఫొటో.. ఇవన్నీ జ్ఞాపకాల వస్త్రంపై అందమైన అల్లికలుగా మిగిలిపోయాయి. 12 మంది కార్మికులతో మొదలై ఇప్పడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ బ్రాండ్ గా నిలిచింది.
Parle-G ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే, మహమ్మారి కాలంలో కూడా, పెద్ద పెద్ద కంపెనీల వ్యాపారాలు మందగించినా కూడా, Parle-G కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కట్ గా పార్లే-G అవతరించింది. అయితే ప్యాకెట్ పై చిన్నారి ఫొటో అందరి మనసుల్లో ముంద్రపడిపోయింది. ఈ పాప ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫొటోగా అందరూ భ...