Thursday, July 3Welcome to Vandebhaarath

Parle-G story: 12 మంది కార్మికులతో మొదలై… రూ.8000కోట్ల విక్రయాలతో ప్రపంచంలోనే టాప్ గా నిలిచిన బిస్కెట్ బ్రాండ్..

Spread the love

Parle-G Story : కేవలం బిస్కెట్ మాత్రమే కాదు.. ఇది మనతో శాశ్వతమైన అనుబంధం ఏర్పరుచుకున్న చిన్ననాటి జ్ఞాపకాల రుచి. ఉదయం సాయంత్రం వేళల్లో టీ లేదా పాలతో  చక్కని కాంబినేషన్, నోటిలో వేసుకోగానే కమ్మనైన టేస్ట్ ఇస్తూ కరిగిపోతుంది. ఐకానిక్ పసుపు రంగు ప్యాకెట్‌పై ముద్దులొలికే చిన్న పాప ఫొటో.. ఇవన్నీ జ్ఞాపకాల వస్త్రంపై అందమైన అల్లికలుగా మిగిలిపోయాయి. 12 మంది కార్మికులతో మొదలై ఇప్పడు ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే బిస్కెట్ బ్రాండ్ గా నిలిచింది.
Parle-G ఎంతగా ప్రసిద్ధి చెందిందంటే, మహమ్మారి కాలంలో కూడా, పెద్ద పెద్ద కంపెనీల వ్యాపారాలు మందగించినా కూడా, Parle-G కి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కట్ గా పార్లే-G అవతరించింది. అయితే ప్యాకెట్ పై చిన్నారి ఫొటో అందరి మనసుల్లో ముంద్రపడిపోయింది. ఈ పాప ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధా మూర్తి చిన్ననాటి ఫొటోగా అందరూ భావించారు. 80వ దశకం ప్రారంభం వరకు మన పార్లే-జి పార్లెజ్-గ్లూకో అని పిలిచేవారు. పార్లే గురించిన మరెన్నో ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..

పార్లే జీ ప్రస్థానం ఇదీ..

1929లో స్వదేశీ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ముంబై లోని చౌహాన్ కుటుంబానికి చెందిన మోహన్‌లాల్ స్వదేశీ ఉద్యమానికి ప్రభావితుడై భారతీయ వస్తువులను ప్రోత్సహించాలనే పిలుపుతో దయాల్.. మిఠాయి వ్యాపారంలోకి ప్రవేశించాలని భావించారు. అప్పట్లో బిస్కెట్లు ఖరీదైనవిగా ఉండేవి విదేశాలనుంచి దిగుమతి చేసుకునేవారు. అయితే బిస్కెట్ల పరిశ్రమ ఏర్పాటు కోసం మొదట మోహన్ లాల్ జర్మనీకి వెళ్లి అక్కడ అన్ని నైపుణ్యాలను తెలుసుకొని స్వదేశానికి తిరిగి వచ్చేటపుడు జర్మనీ నుంచి ఓడలో మిఠాయి పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన యంత్రాలను రూ.60వేలకు దిగుమతి చేసుకున్నారు. ఆ యంత్రాలతో పాటు కేవలం 12 మంది కార్మికులతో దయాల్ నివసించిన గ్రామం పార్లే లో పరిశ్రమను ఏర్పాటు చేశారు. మొదట్లో వీరు నారింజ మిఠాయి తయారు చేశారు. కాగా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ప్రజల్లో చెరగని ముద్రవేశాయి ఈ బిస్కెట్లు. కేవలం 12 మంది కార్మికులతో మొదలైన పరిశ్రమ కాలపరీక్షకు నిలబడి ఒక ఐకానిక్ బ్రాండ్‌కు పునాది వేస్తుందని వారికి అప్పుడు వారికి తెలియదు.

Parle - G
Source: Parle Products

దీన్ని స్థాపించినవారు ఫ్యాక్టరీని నడిపించడంలో చాలా బిజీగా ఉండడంతో తమ బ్రాండ్ కు ఒక పేరు పెట్టే విషయమే మరిచిపోవడం ఇక్కడ ఆసక్తికరంగా అనిపిస్తుంది. తర్వాత కాలంలో దేశంలోని మొట్టమొదటి భారతీయ యాజమాన్యంలోని మిఠాయి కంపెనీ గుర్తింపు పొందింది. కొన్నాళ్లకు పరిశ్రమ ఏర్పాటు చేసిన గ్రామం పార్లే  బ్రాండ్ పేరుగా సుస్థిరం చేసుకుంది.

పార్లే Gలో G అంటే గ్లూకోజ్!

1938లో భారతదేశంలో పార్లే బిస్కెట్ “పార్లే గ్లూకో”గా వినియోగదారులకు పరిచయమైంది. అయితే, 1985లో బిస్కెట్ మార్కెట్‌లో పోటీని అధిగమించేందుకు కంపెనీ తమ ఉత్పత్తి పేరును “పార్లే-జి”గా మార్చాలని నిర్ణయించింది. ప్రారంభంలో పార్లే-Gలోని ‘G’ అనేది ‘గ్లూకోజ్’ని సూచిస్తుంది. ఇది తర్వాత బ్రాండ్ నినాదం ప్రకారం జీ అంటే ‘జీనియస్’గా పేర్కొన్నారు. అప్పటి నుంచి పార్లే-జి బిస్కెట్ల ప్యాకేజింగ్ లో గానీ రుచిలో గానీ మార్పు రాలేదు.
1980లలో, ఈ బిస్కెట్లు అన్ని వయసుల ప్రజల్లో ఆదరణ పొందాయి. అయితే ప్రముఖ కంపెనీ బ్రిటానియా కూడా తమ సొంత గ్లూకోజ్ బిస్కెట్లను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ క్రమంలో పార్లే సవాళ్లను ఎదుర్కొంది. కస్టమర్‌లు సాధారణంగా కంపెనీ పేరు చెప్పకుండా దుకాణదారులను “గ్లూకోజ్ బిస్కెట్లు” అడుగుతారు. దీనికి షాపు వారు పార్లే బిస్కట్లనే ఇస్తుంటారు. పల్లెటు పట్టణాలు అనే తేడాలేకుండా అన్ని చోట్లా ఈ బిస్కెట్లు ప్రజలకు మమేకమయ్యాయి.

Parle-G ప్యాకెట్ పై ఉన్న పాప ఎవరు?

దశాబ్దాలుగా, పార్లే-G ప్యాకేజింగ్‌ పై ఉన్న ముద్దులొలికే పసిపాప ఫొటో అందరినీ కట్టి పడేస్తుంది. ఇది ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి చిన్ననాటి ఫోటో అని కొందరు భావించారు. ఈ పాప ఫొటోపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. మరికొందరు నీరూ దేశ్‌పాండే అని, గుంజన్ గుండానియా అని అనుకున్నారు. ఎట్టకేలకు పార్లే ప్రొడక్ట్స్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ మయాంక్ షా అసలు నిజాన్ని బయటపెట్టారు. కవర్‌పై ఉన్న అమ్మాయి ఫొటో నిజమైన వ్యక్తి కాదట. 1960లలో ‘ఎవరెస్ట్ క్రియేటివ్‌’కు చెందిన కళాకారుడు మగన్‌లాల్ దహియా రూపొందించిన ఒక ఊహాచిత్రం అని వెల్లడించారు.

Parle-G కి ప్రజాదరణ పెరుగుతూనే ఉంది. బిస్కెట్ భారతదేశం వ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలోని వివిధ దేశాలకు కూడా విస్తరించింది. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలకు చక్కని స్నాక్స్ గా గా మారింది. Parle-G ప్రజాదరణ సరిహద్దులను దాటింది. US, UK, కెనడా, న్యూజిలాండ్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా వంటి ఆరు దేశాలలో తయారీ యూనిట్లతో ఇది ప్రపంచవ్యాప్తంగా హృదయాలను గెలుచుకుంది. ఆశ్చర్యకరంగా, దేశంలోని అన్ని ఇతర బిస్కెట్ బ్రాండ్‌లను అధిగమించి చైనా పార్లే-జి అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది.

Parle Products
Source: Parle

2013లో భారతదేశంలో రూ. 000 కోట్ల మార్కును దాటిన మొదటి FMCG ఉత్పత్తిగా అవతరించింది. నీల్సన్ సర్వే ప్రకారం, రిటైల్ విక్రయాలలో 5,000 కోట్ల రూపాయలను అధిగమించిన మొదటి భారతీయ FMCG బ్రాండ్ పార్లే-జినే. చైనాలో పార్లే-జి ఇతర బ్రాండ్ బిస్కెట్ల కంటే ఎక్కువగా అమ్ముడవుతోంది
మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్ 2011లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్ బ్రాండ్‌గా పార్లే-జి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. వాస్తవానికి, పార్లే G క్రాఫ్ట్ ఫుడ్స్ యొక్క ఓరియో, మెక్సికోకు చెందిన గేమ్సా, వాల్‌మార్ట్ హౌస్ బ్రాండ్‌లతో సహా ఇతర ప్రసిద్ధ బ్రాండ్‌లను అధిగమించింది. 2018–20 ‌లో 8000 కోట్లకు చేరుకునే వరకు బిస్కెట్ల విక్రయాలు క్రమంగా పెరిగాయి. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు ఒక బిలియన్ కు పైగా అమ్మకాలు చేస్తోంది.  ఏడాదికి 14,600కోట్ల బిస్కట్లను విక్రయిస్తోంది.

parle biscuits
Source : Parle

లాక్ డౌన్ లో రక్షకుడు

2020లో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి తీసుకువచ్చిన లాక్‌డౌన్ కారణంగా చాలామంది బిస్కెట్ పార్లే-జి వంటి సులభంగా లభించే, అవసరమైన ఆహారాలను నిల్వ చేయడం ప్రారంభించారు. అలాగే అనేక NGOలు, ప్రభుత్వ సంస్థలు సామాగ్రి పంపిణీ కోసం పెద్ద మొత్తంలో పార్లే-జి ప్యాకెట్లను కొనుగోలు చేశాయి. దీంతో బిస్కెట్ అమ్మకాలకు గణనీయంగా పెరిగాయి.

పార్లే విజయానికి విస్తృతమై పబ్లిసీటీ తోపాటు నమ్మకమైన నాణ్యత, మైమరిపించే రుచి ప్రధాన కారణంగా నిలిచాయి.


Green Mobilty, Ev, Environment News కోసం హరిత మిత్ర ను సందర్శించండి, తాజా వార్తలు, ప్రత్యేక కథనాల కోసం వందేభారత్ ను చూడండి. ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..