Wednesday, December 31Welcome to Vandebhaarath

Tag: Mamata Banerjee

West Bengal | బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు:
National

West Bengal | బెంగాల్ రాజకీయాల్లో భారీ కుదుపు:

ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు .. కొత్త పార్టీ పెట్టిన హుమాయున్ కబీర్..!West Bengal Politics | కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన భరత్‌పూర్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ (Humayun Kabir) తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ తరహా మసీదుకు పునాది వేసి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన కబీర్, ఇప్పుడు 'జనతా ఉన్నయన్ పార్టీ' (Janata Unnayan Party) అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.ఎమ్మెల్యే సభ్యత్వం రద్దుమరోవైపు, హుమాయున్ కబీర్ సభ్యత్వంపై పశ్చిమ బెంగాల్ (West Bengal ) అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ సోమవారం కీలక ప్రకటన చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు.బెల్దంగాలో జరిగిన బహిరంగ సభలో కబీర్ ప్రసంగిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో జరగనున్న అసెంబ్...
ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మమతా బెనర్జీ ఆందోళ‌న‌ – West Bengal Politics
Elections, National

ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా మమతా బెనర్జీ ఆందోళ‌న‌ – West Bengal Politics

రేప‌టి నుంచి భారీ ర్యాలీ చేప‌డతామ‌ని ప్ర‌క‌ట‌న‌West Bengal Politics | కోల్‌కతా : ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలనే నిర్ణయంపై పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా, అధికార తృణమూల్ కాంగ్రెస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ SIR ప్రక్రియను బహిరంగంగా వ్యతిరేకించారు. తన అభ్యంతరాన్ని తెలియజేసేందుకు మంగళవారం (నవంబర్ 4) కోల్‌కతాలో భారీ నిరసన ప్రదర్శన చేప‌డ‌తామ‌ని ముఖ్యమంత్రి మమతా ప్రకటించారు.SIR ఏమిటి?వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌తో సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించి రెండో దశను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ఇటీవలే ప్రకటించింది. SIR ప్ర‌క్రియ‌ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది. ముసాయిదా ఓటరు జాబితా డిసెంబర్ 9న ప్రచురించనున్నారు. ఇక తుది జాబితా ఫిబ్రవరి 7న విడుదల చ...
Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ
Crime

Durgapur | ‘అమ్మాయిలు రాత్రిపూట కళాశాల బయటకు వెళ్లొద్దు.. దుర్గాపూర్ గ్యాంగ్ రేప్ కేసుపై సీఎం మమతా బెనర్జీ

దుర్గాపూర్‌ (Durgapur ) లో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) మౌనం వీడారు, ఆమె వ్యాఖ్యలు మ‌రింత‌ ఆగ్రహావేశాలకు కార‌ణ‌మ‌య్యాయి. మీడియాను ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ, "ఒక బాలికను రాత్రిపూట బయటకు వెళ్లనివ్వకూడదు" అని, ఈ సంఘటన ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో జరిగినందున తన ప్రభుత్వాన్ని నిందించడం స‌రికాద‌ని అన్నారు. "కళాశాల అధికారులు ఆమెకు భద్రత కల్పించి ఉండాల్సి ఉంద‌ని ఆమె అన్నారు.దుర్గాపూర్‌ (Durgapur ) సంఘటన ఇదీ..కోల్‌కతాకు దాదాపు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గాపూర్‌లోని శోభాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రాంగణానికి సమీపంలో శుక్రవారం రాత్రి ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒడిశాలోని జలేశ్వర్‌కు చెందిన 23 ఏళ్ల ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు, తన స్నేహితుడితో కలిసి భోజనం చేసి తిరిగి వస్తుండగా ఆమ...
Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..
Trending News

Nabanna Abhijan Rally | కోల్ కతా రేప్ కేసులో మమత రాజీనామాకు పట్టు.. విద్యార్థుల ఆందోళన.. పరిస్థితి ఉద్రిక్తం..

Nabanna Abhijan Rally updates: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యురాలిపై అత్యాచారం-హత్యకు పాల్పడిన వారిపై క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛత్ర సమాజ్ 'నబన్న అభిజన్' ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మ‌మ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. అత్యాచారం కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సచివాలయం వైపు కవాతు నిర్వహించారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసుపై ఆగ్ర‌హంతో ఉన్న‌ నిరసనకారులు రాళ్లు రువ్వారు.ఆగస్టు 9న కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై ...
Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్
National

Sandeshkhali row : ‘మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

Sandeshkhali row : పశ్చిమ బెంగాల్ లో ప్రతిపక్ష నాయకుడు, బిజెపి నేత సువేందు అధికారి శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ(Sandeshkhali) లో అధికార టీఎంసీ పార్టీని 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణ‌మూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండ్ పార్టీ నాయకుడు షేక్ షాజహాన్ (Sheikh Shahjahan) నివాసంలో విదేశీ రివాల్వర్‌లతో సహా అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్న తరువాత సువేందు అధికారి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రమాద‌క‌ర‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని, షేక్ లాంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న ముఖ్య‌మంత్రికి ఈ రాష్ట్రానికి సీఎంగా కొనసాగే నైతిక అధికారాన్ని కోల్పోయార‌ని అన్నారు.''సందేశ్‌ఖాలీలో దొరికిన ఆయుధాలన్నీ విదేశాల నుంచి వ‌చ్చిన‌వే.. ఆర్డీఎక్స్ ల...
Sandeshkhali |  సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..
Crime, National

Sandeshkhali | సందేస్‌ఖాలీ దాడిలో విదేశీ పిస్టల్స్‌తో సహా భారీగా ఆయుధాలను స్వాధీనం..

Sandeshkhali Raids | పశ్చిమ బెంగల్ లోని సందేశ్ ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల బృందంపై జరిపిన దాడికి సంబంధించి సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈమేరకు శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలోని రెండు స్థావరాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనవరి 5న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్ అనుచ‌రుల నుంచి ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. కాగా సీబీఐ అధికారుల,  ఎన్‌ఎస్‌జీ కమాండోల బృందం సందేశ్‌ఖాలీకి చేరుకున్న విషయం తెలుసుకొని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల సాయంతో ఐదు బృందాలు దాడులు నిర్వహించాయని ఏజెన్సీ అధికారులు తెలిపారు. కొంద‌రు అనుమానితుల వ‌ద్ద‌ భారీగ...