Nabanna Abhijan Rally updates: మమతా బెనర్జీ రాజీనామా చేయాలని, వైద్యురాలిపై అత్యాచారం-హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఛత్ర సమాజ్ ‘నబన్న అభిజన్’ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అత్యాచారం కేసులో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలోని వివిధ ప్రాంతాల్లో సచివాలయం వైపు కవాతు నిర్వహించారు. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం-హత్య కేసుపై ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు రాళ్లు రువ్వారు.
ఆగస్టు 9న కోల్‌కతాలోని RG కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం హత్యకు సంబంధించి భారతీయ జనతా పార్టీ (BJP) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై న్యాయమైన విచారణ జరిగేలా ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసు కమిషనర్ వినీత్ గోయెల్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని బిజెపి డిమాండ్ చేసింది. అయితే
హత్యాచారం కేసులో బాధితురాలు మొదట ఆత్మహత్యతో మరణించిందని పార్టీ మొదట్లో ఆరోపించింది. బాధితురాలికి న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోల్‌కతాలో ర్యాలీ చేపట్టిన విద్యార్థులపై పశ్చిమ బెంగాల్ పోలీసులు లాఠీఛార్జ్ చేసింది. ఈ ఘటనపై బీజేపీ మండిపడింది. “నిజం బయటకు రావాలి. ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. మమతా బెనర్జీ, పోలీసు కమిషనర్‌లకు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించి నిజానిజాలు తేల్చాలి’’ అని బీజేపీ డిమాండ్ చేస్తోంది. కోల్‌కతా పోలీసులు హౌరా బ్రిడ్జి వద్ద ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు సచివాలయం వైపు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి వాటర్ క్యానన్లు, బాష్పవాయువు ప్రయోగించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.