SIR | మధ్యప్రదేశ్ లో 42 లక్షల మంది పేర్లు తొలగింపు..
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అర్హత లేని, మరణించిన, వలస వెళ్ళిన దాదాపు 42.74 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సంజీవ్ కుమార్ ఝా వెల్లడించారు.తొలగింపులకు ప్రధాన కారణాలుమొత్తం 5.74 కోట్ల మంది ఓటర్లలో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం ఈ క్రింది విభాగాల వారీగా పేర్లను తొలగించారు:వలస వెళ్ళిన/గైర్హాజరైన వారు: 31.51 లక్షలు (5.49%)మరణించిన వారు: 8.46 లక్షలు (1.47%)డూప్లికేట్ ఓటర్లు (ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు): 2.77 లక్షలు (0.48%)తొలగించబడిన వారిలో 19.19 లక్షల మంది పురుషులు కాగా, 23.64 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.కీలక తేదీలు గుర్తుంచుకోండిఅభ్యంతరాల స్వీకరణ : జనవరి...










