
MLC Elections : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కోదండరామ్.. మిగతా ఎవరికి చాన్స్..?
MLC Elections 2024 : ఉస్మానియా యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ ఎం కోదండరామ్‌ను తెలంగాణ రాష్ట్ర శాసనమండలికి గవర్నర్ కోటా కింద తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ ఒకట్రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఇద్దరు గవర్నర్ కోటా కింద, మరో ఇద్దరు ఎమ్మెల్యేల కోటా కింద నామినేట్ చేయనుండగా జనవరి 29న పోలింగ్ జరగనుంది.తెలంగాణలో ఎమ్మెల్యేల కోటా రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం గత గురువారం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇటీవలి ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు వారి పదవులకు రాజీనామా చేయడంతో ఈ రెండు స్థానాలకు ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఇటీవల రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. ఎలాంటి పోటీ లేకుండా రెండు స్థానాలను సునాయాసంగా ...