
Annamalai Biopic | త్వరలో బీజేపీ నేత అన్నామలై బయోపిక్జీ.. ఆయన పాత్రలో నటించేదెవరో తెలుసా.. ?
Annamalai Biopic | యూపిఎస్సి లో 244వ ర్యాంకు సాధించిన అన్నామలై అంచలంచలిగా ఎదిగి నిజాయితీ గల పోలీసు అధికారిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. పోలీసు ఉన్నత ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రభుత్వ అధికారిగా ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నాకూడా వారి పై స్థాయి అధికారికి తలవంచి పనిచేయాల్సిందే.. కాబట్టి ఖద్దరు దుస్తుల్లోకి మారితే రాజకీయాల్లో స్వతంత్రంగా పనిచేయవచ్చని భావించారు అన్నామలై.. . ఒకప్పటి డైనమిక్ పోలీస్ సింగం..ఇప్పుడు అసంఖ్యమైన అభిమానులను సంపాదించుకున్నయువ రాజకీయవేత్తగా అన్నామలై మారిపోయారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన అంశాలను కలిగిన అన్నామలై జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.చెన్నై వర్గాల సమాచారం ప్రకారం, తమిళ స్టార్ విశాల్ కృష్ణ తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై పాత్రను తెరపైకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. "విశాల్ తె...