Saturday, August 30Thank you for visiting

Tag: hyderabad

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

TGSRTC | ఆర్టీసీలో చిల్లర డబ్బులకు చెక్.. టికెటింగ్ విధానం మరింత ఈజీ

Telangana
TGSRTC హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్ పేమెంట్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లుచేయాల‌ని టీజీఎస్ ఆర్టీసీ యోచిస్తోంది. హైదరాబాద్‌లో ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద డిజిటల్ చెల్లింపులు. టచ్-అండ్-గో విధానంతో టికెటింగ్‌ను మ‌రింత సుల‌భ‌త‌ర‌మ‌వుతుంది. రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం కింద జారీ చేయబడిన టిక్కెట్లను జీరో-ఫేర్ టిక్కెట్లుగా పిలుస్తారు.దీనికోసం ప్రత్యేక యంత్రాలను కూడా ఏర్పాటు చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ‌ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తోంది. ఇటీవలే, TGSRTC ఔటర్ రింగ్ రోడ్ కారిడార్ అంతటా ఎలక్ట్రిక్ బస్స...
Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Local Body Polls | గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telangana
3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశంహైద‌రాబాద్ : మూడు నెలల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు (Local Body Polls ) నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి సంబంధించిన ఆరు పిటిషన్లపై తీర్పు వెలువరిస్తూ జస్టిస్ టి. మాధవి దేవి ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు సకాలంలో నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వాదనలు ముగిసిన తర్వాత ఈ వారం ప్రారంభంలో కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత ఈ తీర్పు వెలువడింది.హైకోర్టు ఆదేశాల‌తో త్వరలోనే తెలంగాణ ఎన్నికల నగారా మోగనుంది. ఇప్పటికే ఆలస్యమైన స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Polls ) నిర్వాహణపై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 3 నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని న్యాయ‌స్థానం రాష్ట్ర ఎ...
Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

Tiranga Yatra | తిరంగా యాత్ర‌ను విజ‌య‌వ‌తం చేయండి

Telangana
కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి పిలుపుTiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆప‌రేష‌న్ సింధూర్ (Operation Sindoor) విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో మ‌న వీర‌జ‌వాన్ల‌కు మద్దతు తెలుపుతూ శ‌నివారం ట్యాంక్ బండ్ వ‌ద్ద నిర్వ‌హించే తిరంగా యాత్ర‌ (Tiranga Yatra )ను విజ‌య‌వంతం చేయాల‌ని   బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్ర‌వారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన ప‌హ‌ల్గామ్ ఘ‌ట‌న‌కు  కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశార‌ని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప...
Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Telangana
Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు ...
Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Future City | ఫ్యూచర్ సిటీపై స్పెషల్ ఫోకస్.. నగరానికి అన్ని వైపులా రోడ్డు, రైలు కనెక్టివిటీ

Telangana
Future City | రాష్ట్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్ ఫ్యూచ‌ర్ సిటీపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో 7,257 చదరపు కిలోమీటర్ల (చదరపు కి.మీ) విస్తీర్ణంలో ఉన్న హెచ్‌ఎండీఏ ఇప్పుడు 11 జిల్లాల్లో దాదాపు 10,472.71 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉంటుంది. HMDA నాలుగు వైపులా విస్తరిస్తుంది. ఇప్ప‌టికే మ్యాప్ తయారీలో ఉందని అధికారులు చెబుతున్నారు. "రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు ఉన్న ప్రాంతాన్ని HMDA అధికార పరిధిగా నేరుగా తీసుకోలేం, ఎందుకంటే 36 గ్రామాలను HMDA నుంచి తొలగించి కొత్తగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కింద చేర్చారు" అని HMDA అధికారులు చెబుతున‌న్నారు.Future City : క‌నెక్టివిటీ కోసం రైలు, రోడ్డు మార్గాలునగర శివార్లలోని అనేక గ్రామాలను HMDAతో విలీనం చేయడం వల్ల మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి గ్రేటర్ హైదరాబాద్‌కు కనెక్టివిటీ కూడా పెరు...
UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

UTS Cashback Offer | ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్ | UTS మొబైల్ యాప్ తో అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్

National
UTS Cashback Offer | రైలు ప్ర‌యాణికుల‌కు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్‌ టికెటింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా అన్‌రిజర్వ్‌డ్‌ టిక్కెట్లపై క్యాష్ బ్యాక్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారుల అభిప్రాయం ప్రకారం, UTS యాప్ ఆధునిక టికెటింగ్ వ్యవస్థలో ఒక పెద్ద ముందడుగు. భారతీయ రైల్వేస్‌లో అన్‌ రిజర్వ్ టిక్కెట్లపై ప్రయాణించేవారికి ఇది ఒక వరంగా చెప్ప‌వ‌చ్చు. డిజిటల్ ఇండియా చొరవకు అనుగుణంగా, ఈ యాప్ నగదు రహిత లావాదేవీలను ప్రోత్స‌హిస్తుంది. ప్రయాణీకులు R-Wallet, Paytm, PhonePe, Googlepay, UPI యాప్‌లు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ డిజిటల్ ప్లాప్‌ఫాంల ద్వారా చెల్లింపు చేయవచ్చు. R-Wallet UTS యాప్‌లో అందుబాటులో ఉంటుంది. దీనిలో మొత్తాలను రూ. 20,000 పరిమితి వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రచార సూచనగా, R-Wallet ద్వారా కొనుగోలు చేసిన టిక్కెట్లపై 3 శాతం క...
High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

High Speed Rail | హైదరాబాద్ నుండి చెన్నై, బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు

Trending News
High Speed Rail | హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru) లేదా చెన్నైకి కేవలం రెండు గంటల్లోనే చేరుకోవడాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాదాపు విమానంలో ప్రయాణించినంత వేగంగా.. కానీ విమానాశ్రయంలో మాదిరిగా భద్రత చెక్-ఇన్‌ల ఇబ్బంది లేకుండా సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే, కేంద్రం ప్రతిపాదించిన రెండు హై-స్పీడ్ రైలు కారిడార్ల ద్వారా ఈ అద్భుతం నిజం కానుంది. 320 కి.మీ. వేగంతో నడిచే ఈ హై-స్పీడ్ రైళ్లు రైలు ప్రయాణ సమయాన్ని దాదాపు 10 గంటలు తగ్గిస్తాయి. హైదరాబద్ నుంచి ప్రయాణీకులు బెంగళూరుకు కేవలం 2 గంటల్లో, చెన్నైకి 2 గంటల 20 నిమిషాల్లో చేరుకోగలరు .High Speed Rail : విమానాల కంటే వేగంగానా?ప్రస్తుతం, హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానాలు చేరుకోవడానికి 1 గంట 15 నిమిషాలు పడుతుండగా, చెన్నై అంతర్జాతీయ విమాన...
EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

EV Bus | టీజీఎస్ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల పెంపుపై కార్మికుల్లో ఆందోళన

Telangana
TGSRTC EV Bus | ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం గ్రీన్ మొబిలిటీని ప్రోత్స‌హించే దిశ‌గా టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC ) లో ఎలక్ట్రిక్ బస్సుల (EV Bus) సంఖ్య‌ను తెలంగాణ ప్రభుత్వం క్ర‌మ‌క్ర‌మంగా పెంచుకుంటూ పోతోంది. అయితే ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలలో ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. జిసిసి మోడల్‌లో ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగుల‌కు ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా చేస్తుంద‌ని యూనియన్ నాయకులు భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్‌ఆర్‌టిసి) ఫ్లీట్‌కు ఎలక్ట్రిక్ బస్సులను మ‌రిన్ని ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో సహా ఇత‌ర మంత్రులు అనేక సందర్భాల్లో ప్ర‌క‌టించారు. డీజిల్‌తో నడిచే కాలం చెల్లిన‌ బస్సుల స్థానంలో దాదాపు 3,000 ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) వచ్చే అవకాశం ఉందని అంచనా. కార్బన్ పాదముద్రను తగ్గించడం, పర్యావరణ అనుకూల ప్ర...
Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Hyderabad Metro Rail : ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా కొత్త రైళ్లు..

Telangana
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు.బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో 'Me Time On My Metro' పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు.ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చ...
Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Charlapalli Railway Station : ఇక‌పై ఈ రైళ్లు చ‌ర్ల‌ప‌ల్లి వ‌ర‌కే..

Telangana, తాజా వార్తలు
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, స‌క‌ల సౌకర్యాల‌తో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్ట‌కేల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. ఈ రైల్వే టెర్మిన‌ల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వేస్టేష‌న్ల త‌ర్వాత చ‌ర్ల‌ప‌ల్లి స్టేష‌న్‌ కీలకమైన టెర్మిన‌ల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చ‌ర్లపల్లి నుంచే నడిపించ‌నున్నారు. దీనివ‌ల్ల సికింద్రాబాద్, నాంప‌ల్లి, కాచీగూడ‌ స్టేషన్ల‌లో రద్దీ తగ్గుతుంది. చ‌ర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా...