Mizoram History : మార్చి 5, 1966న మిజోరంలో ఏం జరిగింది? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఏమిటి?
ఇటీవల ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ తన ప్రసంగంలో కాంగ్రెస్‌ను విమర్శించడానికి ఈశాన్య ప్రాంత చరిత్రలోని అనేక కీలక ఘట్టాలను ప్రస్తావించారు. అందులో ముఖ్యంగా 1966లో మార్చి 5న ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మిజోరం ప్రజల తిరుగుబాటును నిలువరించేందుకు బాంబుదాడి చేసిందని గుర్తు చేశారు. ఇందులో ఎంతో మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. అసలు ఈ దారుణ ఘటనకు దారి తీసిన పరిణామాలు మిజోరం చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..క్లుప్తంగా..
మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) తిరుగుబాటుకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం (IAF) మార్చి 5, 1966న మిజో హిల్స్ (ప్రస్తుత మిజోరం)లోని ఐజ్వాల్ నగరంపై బాంబు దాడి చేసింది. బాంబు దాడికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశాలిచ్చారు. నివేదికల ప్రకారం, ఆహార సంక్షోభం, తీవ్రమైన కరువును ఎదుర్కోవడానికి ఏర్పడిన మిజో నేషనల్ ఫామి...