Family Digital Card | ఇకపై ప్రతీ కుటుంబానికి ఫామిలీ డిజిటల్ కార్డు.. సంక్షేమ పథకాలన్నింటికీ ఒకటే..
Family Digital Card | రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్‌తోపాటు సంక్షేమ పథకాలన్నింటికీ ఒకే కార్డు జారీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే `వన్ స్టేట్ – వన్ డిజిటల్ కార్డ్` విధానాన్ని తెలంగాణలో ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో లబ్ధిదారులు ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా చర్యలు తీసుకోనున్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులకు ఆరోగ్య సేవలు అందుతాయి. అందులో ప్రతీఒక్కరి హెల్త్ పొఫైల్ తప్పని...