
Petrol diesel prices cut పెట్రో, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం …
Petrol Diesel Prices Cut in India: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్వల్ప ఊరట కలిగించింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు సుమారు రూ.2 తగ్గించినట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ ప్రకటించారు. ప్రకటనలో వెల్లడించారు. ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ వివరాలు షేర్ చేశారు. ఈ ధరలు మార్చి 15 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయని మంత్రి తెలిపారు.‘‘పెట్రోలు, డీజిల్ ధరలను రూ.2 తగ్గించడం వల్ల దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యం కోసం ప్రధాని మోదీ నిరంతరం పని చేస్తున్నట్లుగా మరోసారి నిరూపించారు” అని కేంద్ర మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘మార్చి 14, 2024 రూపాయి విలువ ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున రూ.94 అయితే ఇటలీలో రూ.168.01గా ఉంది అంటే 79 శాతం ఎక్కువ, ఫ్రాన్స్‌లో రూ.166.87గా ఉంది అంటే.. 78 శాతం ఎక్కువ, జర్మనీలో రూ.159.57, స్...