Sunday, April 27Thank you for visiting

Tag: Delhi Police

న్యూస్ క్లిక్ ఫౌండర్ పై 8000 పేజీల చార్జ్ షీట్.. షాకింగ్ విషయాలు చెప్పిన ఢిల్లీ పోలీసులు

న్యూస్ క్లిక్ ఫౌండర్ పై 8000 పేజీల చార్జ్ షీట్.. షాకింగ్ విషయాలు చెప్పిన ఢిల్లీ పోలీసులు

Crime, National
Chargesheet on Newsclick Founder |  న్యూఢిల్లీ: ప్రముఖ న్యూస్ పోర్టల్ అయిన న్యూస్‌క్లిక్ (Newsclick ) వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha) పై ఢిల్లీ పోలీసులు తన ఛార్జిషీట్ న‌మోదు చేశారు. దాదాపు 8,000 పేజీలతో కూడిన చార్జిషీట్ లో తీవ్రవాద నిధులు చైనా ప్రచారాన్ని ప్రోత్సహించడం, 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించి అనేక నేరాల‌తో ప్ర‌బీర్ కు లింక్ ఉంద‌ని పేర్కొంది. భారత్‌లో చైనా ప్రచారాన్ని ప్రసారం చేసేందుకు నిధులు అందుకున్నారనే ఆరోపణలపై పుర్కాయస్థపై తీవ్రవాద నిరోధక చట్టం UAPA కింద దర్యాప్తు చేస్తున్నారు. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, దాని హెచ్‌ఆర్ అధిపతి అమిత్ చక్రవర్తిని గత ఏడాది అక్టోబర్ 3న ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. నగరమంతటా పోలీసులు సోదాలు చేసిన తర్వాత వారిని అదుపులోకి తీసుకుని, UAPA కింద అభియోగాలు మోపారు. అప్పటి నుంచి వారిద్దరూ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు....
ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో :  ఎఫ్ఐఆర్ నమోదు

ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దుపై టాంపర్డ్ వీడియో : ఎఫ్ఐఆర్ నమోదు

Elections, National
Amit Shah Doctored Video | న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) రిజర్వేషన్ కోటాలను రద్దు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పిన‌ట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ ఫేక్ వీడియోను స‌ర్క్యులేట్ చేసిన‌వారిపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఫిర్యాదు చేసింది. ఈ వీడియోపై భారతీయ జనతా పార్టీ (BJP ) ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు ఆదివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజకీయ ర్యాలీలో షా చేసిన అసలు వ్యాఖ్య‌ల‌ను వక్రీకరించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో మార్చార‌ని బీజేపీ ఆరోపించింది. బీజెపి ఆంధ్రప్రదేశ్ యూనిట్ ఈ ఫిర్యాదును దాఖలు చేసింది. కాంగ్రెస్ X ఖాతాను బ్లాక్ చేసి దర్యాప్తు  ప్రారంభించాలని రాష్ట్రంలోని ఎన్నికల సంఘం అధికారిని కోరింద...
ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

Trending News
న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత, అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను తన మొబైల్ ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..