వరుణుడి కరుణ కోసం రైతన్నల ఎదురుచూపు
రిజర్వాయర్లలో గతేడాది కంటే భారీగా తగ్గిన నీటిమట్టాలు
వర్షాల కోసం అన్నదాతలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ సాగు ఆలస్యమవుతోంది. సాగు విస్తీర్ణం 2022తో పోలిస్తే అన్ని పంటల సాగు తగ్గిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.జూన్-సెప్టెంబర్ కాలాన్ని ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు, సాధారణంగా రుతుపవనాలు వచ్చే జూన్ మొదటి వారంలో నాట్లు వేగవంతమవుతాయి. కానీ ఈ సంవత్సరం అలా జరగలేదు. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 10 శాతం, మొక్కజొన్న 4 శాతం, పత్తి 7 శాతం తగ్గినట్లు వాతావరణ శాఖ నివేదిక పేర్కొంది.సుదీర్ఘ వేసవి కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టాలు కూడా తగ్గిపోయాయి. అలాగే సాగుబడికోసం సాగునీటి ప్రాజెక్టుల నుంచి ప్రభుత్వం నీటిని అందించలేకపోయింది. మరోవైపు అనేక ప్రాంతాల్లో నీటి కష్టాలు నమోదవుతున్నందున, మిషన్ భగీరథ ద్వారా ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంపైనే దృష్టి సా...