Samsung Crystal 4k TV | తక్కువ ధరలోనే హైటెక్ ఫీచర్లతో శామ్‌సంగ్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి.. వీటి ధరలు
Samsung Crystal 4K TV Series : భారతదేశంలో అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన Samsung కంపెనీ.. Crystal 4K Vivid స్మార్ట్ టీవీ సిరిస్ ను లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 32,990. అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, 18 నెలల వరకు నో కాస్ట్ EMIతో ఈ స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 2024 క్రిస్టల్ 4K TV లైనప్ 4K అప్‌స్కేలింగ్, సోలార్ సెల్ రిమోట్, మల్టీ-వాయిస్ అసిస్టెంట్, Q-సింఫనీ వంటి ఆకట్టుకునే ఫీచర్లతో, క్రిస్టల్ ప్రాసెసర్ 4K తో వస్తుంది.కొత్త క్రిస్టల్ 4కె వివిడ్, క్రిస్టల్ 4కె విజన్ ప్రో, క్రిస్టల్ 4కె వివిడ్ ప్రో టీవీ సిరీస్‌లు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతోపాటు Samsung.comలో 43-అంగుళాల, 50-అంగుళాల, 55-అంగుళాల, 65-అంగుళాలు, 75-అంగుళాల స్క్రీన్‌ల పరిమాణాల్లో అందుబాటులో ఉన్నాయి.2024 క్రిస్టల్ 4K TV సిరీస్ శామ్‌సంగ్ టీవీ ప్లస్ ఆన్‌బోర్డింగ్‌తో కూడి...