సీనియర్ పాత్రికేయులు సీహెచ్ వీఎం కృష్ణారావు కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సీహెచ్ వీఎం కృష్ణారావు (64) గురువారం కన్నుమూశారు.
కృష్ణారావుకు 47 ఏళ్ల అపారమైన అనుభవంతో జర్నలిజంలో అమూల్యమైన సేవలందించారు. ఈ రంగంలో ఆయన ప్రయాణం 1975లో ఒక స్టింగర్ గా ప్రారంభమైంది. ప్రతిభ, స్వశక్తితో వేగంగా ఉన్నతస్థానాలకు ఎదిగారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్, ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో సహా పలు పత్రికల్లో ఆయన తన పనితీరుతో ఆంగ్ల, తెలుగు దినపత్రికలపై చెరగని ముద్ర వేశారు. డెక్కన్ క్రానికల్ లో న్యూస్ బ్యూరో చీఫ్ గా 18 సంవత్సరాలకు పైగా పని చేశారు. ఆత్మీయులందరూ “బాబాయి” అని ముద్దుగా పిలుచుకునే కృష్ణారావు.. చురుకైన ఆలోచనలు ఆయనకు పాత్రికేయ వర్గాల్లో గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. కాగా విషాదకరంగా, గత ఏడాది క్యాన్సర్ బారినపడ్డారు. పరిస్థితి విషమించడంతో ఆయన గురువారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె, ఇద్దరు మనుమలు...