
Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి
Wayanad : వామపక్షాలు ఎంత వ్యతిరేకించినా రాహుల్ గాంధీ రెండోసారి వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. వామపక్షాలు, కాంగ్రెస్‌లు భారత కూటమిలో భాగమే, అయినా కూడా ఈ రెండు పార్టీలు కేరళ రాష్ట్రంలో పరస్పరం పోటీ పడుతున్నాయి. అయితే కీలకమైన లోక్‌సభ పోటీకి ముందు కాంగ్రెస్ కి ఎదురుదెబ్బ తగిలింది. వాయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) ప్రధాన కార్యదర్శి పిఎం సుధాకరన్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీ (బిజెపి)లో చేరారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత సుధాకరన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఎంపీ, వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ.. ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ నేతలకు అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. " అయనకు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. మరొమారు గెలిపిస్కతే వాయనాడ్ అభివృద్ధి అవకాశాలను నాశనం చేస్తారనిసుధాకరన్ విమర్శించారు.ఇదిలా ఉండగా, 2019లో అమేథీ నుంచి ఓడిపోయినట్లే, ఈసారి వాయనాడ్ పార్లమెంట్ సీటు (...