
Bhatti Vikramarka | విద్యుత్ శాఖను పీకల్లోతు అప్పుల్లో ముంచేశారు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు..
Deputy CM Bhatti Vikramarka Comments : గత ప్రభుత్వం ప్రతీ శాఖను అప్పుల్లో ముంచేసిందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విమర్శించారు. విద్యుత్ కొనుగోళ్ల కోసం భారీగా రుణాలు చేసి వెళ్లారని మండిపడ్డారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టును ఆయన శనివారం సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్’ (Bhadradri Power Station), ‘యాదాద్రి పవర్ స్టేషన్’ (Yadadri Power Station) నిర్మిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున అప్పులు చేశారు. రాష్ట్రాన్ని భయంకరమైన దుస్థితికి తీసుకొచ్చారు. అందుకే అసెంబ్లీలో శ్వేత పత్రాలు విడుదల చేసి కొంత మేర వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశాం. ప్రస్తుత పరిస్థితుల్లో పక్కా ప్రణాళికతో అడుగులు వేయాల్సి ఉంటు...