
Zodiac signs| ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలు..
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు మార్పులు చేర్పులు చేసే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశాలు కలవు. స్నేహితుల సలహాలు లాభిస్తాయి. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. దైవానుగ్రహం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. Chit Fund వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. అసంతృప్తి భోజనం ఉంటుంది. నడుము నొప్పి ఒక సమస్యగా మార...