AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండర్లపై ఏపీ సర్కారు కసరత్తు..
AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంటనే పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లకార్డు ఆధారంగా తీసుకొంటే 1.47 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండర్ ను అందించాల్సి ఉంటుంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ.3,640 కోట్ల వరకు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింపజేస్తే.. ఏడాదికి 1,763 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.. అయితే ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించ...