
BSNL: మీ నెట్వర్క్ పనిచేయడం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి
BSNL Network : రిలయన్స్ జియో. భారతీ ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుంచి వినియోగదారులు క్రమంగా BSNLవైపు మొగ్గు చూపడం ప్రారంభించారు. తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్లు ఎక్కువగా ఉండడంతో లక్షలాది మంది ప్రజలు BSNL కు మళ్లారు.BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా టవర్లను 4G కి అప్‌లోడ్ చేస్తోంది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం BSNLకి మారిన చాలా మంది వినయోగదారులు నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే BSNL అనేక నగరాల్లో 4G సేవలను కూడా ప్రారంభిస్తూ వస్తోంది. మీరు సిమ్‌ని బిఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ మీకు సరైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అందకపోతే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.ఇందులో ప్రధానంగా BSNL 4Gలో సరైన నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడం లేదా తక్కువ ఇంటర్నెట్ వేగం...