BSNL 5G SIM : త్వరలో పలు నగరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్
BSNL 5G SIM | గత జూలైలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల కోసం టారిఫ్‌లను పెంచడంతో దేశంలోని అత్యంత చవకైన టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ల అయిన BSNL వైపు అందరూ చూస్తున్నారు. ప్రభుత్వ రంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లోని తక్కువ ఖర్చుతో కూడిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తున్నారు. అయితే ఇటీవల, దేశంలో BSNL రాబోయే 4G, 5G నెట్‌వర్క్‌ల గురించి వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త టెక్నాలజీతో వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోక రానుంది. రాబోయే సాంకేతికత గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవీ..
5G వీడియో కాల్ ట్రయల్
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించారు. 5జీ టెక్నాలజీతో విజయవంతంగా మొదటి వీడియో కాల్ చేశారు. వినియోగదారుల కోసం రోల్‌అవుట్ త్వరలో జరుగుతుందని మంత్రి ప్రకటించడంతో సర్వత్రా ఉత్సాహా...