
Ration card Holders | రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టెంబరు నుంచి బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది. సరుకుల సరఫరాలో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంతోనే రెండు నెలలుగా చక్కెర పంపిణీ నిలిపివేసింది. సెప్టెంబరు నుంచి కొత్త ప్యాకింగులో పంచదార పంపిణీకి రంగం సిద్ధం చేసింది.
గత వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం నిత్యవసరాలను తగ్గించి చివరకు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అందరికి అవసరమైన కందిపప్పును పూర్తిగా నిలిపివేసింది. మూడునెలల కిందట అదికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం కార్డుదారులకు సరకుల సరఫరాపై జిల్లాల వారీగా లబ్ధిదారులు, డీలర్లు, ఎండీయూ వాహనదారులతో సర్వే నిర్వహించింది. కార్డుదారుల్లో ఒక్కొక్కరికి 5 కిలోల వంతున ఉచిత బియ్యం, నగదుకు అరకిలో చక్కెర ఇవ్వనున్నారు. వచ్చేనెల నుంచి కొత్త ప్యాకింగ్‌తో పాటు నిల్వవున్న పాత ప్యాకింగ్‌లోని చక్కెర పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు.