జాతీయ ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు చేయాల్సిందే.. ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
Sanatana Dharma Rakshana Board | తిరుమల లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించారనే వార్తలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) స్పందించారు. కేంద్రం తక్షణమే సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంపై విచారణ జరిపి నేరస్థులకు కఠిన శిక్ష విధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. “తిరుపల వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో జంతువుల కొవ్వు (చేపనూనె, పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపారని గుర్తించడంతో మేమంతా చాలా షాక్ కు గురయ్యాం. ” దిగ్భ్రాంతికరమైన నేరానికి మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు బాధ్యత వహించాలని పవన్ అన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు....