SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు.
SSC స్టేనో రిక్రూట్‌మెంట్ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (Staff Selection Commission) స్టెనో గ్రేడ్ C, D పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే SSC ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా మరో 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఎగ్జామ్ 2024 కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ SSC అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
SSC స్టేనో అర్హత, ఎంపిక విధానం..
విద్యార్హత :
కటాఫ్ తేదీ నాటికి అనగా 17-08-2024 వరకు గుర్తింపు పొందిన బోర్డు లేదా ఏదైనా యూనివర్సిటీ నుంచి 12వ తరగతి లేదా తాత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలి.
వయోపరిమితి :
స్టేనో గ్రేడ్ C కోసం 2024 ఆగష్టు 1కి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. స్టెనో గ్రేడ్ D కి ఆగష్టు 1 2024 కల్లా 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, కంప్రహెన్షన్ సబ్జెక్ట్ ఇంకా ఇంగ్లిష్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు.అబ్జెక్టివ్ టైపు ప్రశ్నాపత్రం ఉంటుంది
దరఖాస్తు ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ (ExM)లకు చెందిన మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మిగతా వారికి 100 రూ ఫీజు.. BHIM యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డు ఏదైనా వీసా, మాస్టర్ కార్డ్, మాస్ట్రో లేదా రూపే డెబిట్ కార్డులను ఉపయోగించి కూడా మాత్రమే ఫీజు చెల్లించవచ్చు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..