Reliance JioTV+ App | రిలయన్స్ జియో తాజాగా JioTV+ యాప్ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఇది Amazon Fire OS ఆధారిత Android, Apple, TVలకు అనుకూలంగా ఉంటుంది. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో వచ్చే జియో సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ తో సాధారణ వినోదం, వార్తలు, క్రీడలు, మ్యూజిక్, కిడ్స్, వ్యాపారం, భక్తి , సహా అన్ని రకాల కంటెంట్ తో 800 కంటే ఎక్కువ డిజిటల్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. అంటే 10+ భాషలు, 20+ జానర్లలో 800+ డిజిటల్ టీవీ ఛానెల్ లను చూడవచ్చు.
Reliance JioTV+ ఫీచర్లు
- ఒక్కసారి మాత్రమే సైన్ ఇన్ చేసి మొత్తం JioTV+ కంటెంట్ కేటలాగ్‌ను యాక్సెస్ చేయవచ్చు.
- స్మార్ట్ టీవీ రిమోట్ : అన్ని JioTV+ కంటెంట్, ఫీచర్లు మీ స్మార్ట్ టీవీ రిమోట్‌ని ఉపయోగించి వీక్షించవచ్చు.
- స్మార్ట్ ఫిల్టర్ : భాష, జానర్, లేదా ఛానెల్ నంబర్లో కీ ప్రెస్ చేయడం ద్వారా ఛానెల్‌ని సర్చ్ చేయవచ్చు.
- స్మార్ట్ మోడ్రన్ గైడ్ : 800+ ఛానెల్‌లను చాలా సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వీటిని ఉపయోగించడానికి సులభమైన స్మార్ట్ ఫిల్టర్లను ఉపయోగించవ్చు. ప్రోగ్రామ్ షెడ్యూల్);
- ప్లేబ్యాక్ వేగాన్ని నియంత్రించవచ్చు.
- క్యాచ్-అప్ టీవీ : గతంలో ప్రసారమైన కార్యక్రమాలను చూడవచ్చు.
- పర్సనలైజ్డ్ రికమండేషన్ : ఛానెల్‌లు, షోలు, వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం కంటెంట్ ను చూపిస్తుంది.
- పిల్లల ప్రొటెకక్షన్.. పిల్లల కోసం ప్రత్యేకంగా క్యూరేటెడ్ విభాగం ఉంటుంది.
OTT ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ విషయానికొస్తే, వినియోగదారులు JioCinema Premium, Disney+ Hotstar, Sony Liv, Zee5, ఫ్యాన్కోడ్లకు యాక్సెస్ పొందుతారు. ఈ యాప్ Google Play Storeలో డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఇది Android TV, Apple TV మరియు Amazon Firestick TVలో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎల్జీ ఓఎస్‌తో నడిచే టీవీలకు త్వరలో సపోర్ట్‌ను అందిస్తామని జియో ప్రకటించింది.
ముఖ్యంగా, Jio AirFiber, Jio Fiber వినియోగదారులందరూ Jio TV+ యాప్‌కి యాక్సెస్ పొందలేరు. యాప్‌కి యాక్సెస్ పొందడానికి వారు కింది ప్లాన్లలో ఒకదానికి సభ్యత్వం పొందాలి:
- JioAirFiber: అన్ని ప్లాన్లు
- JioFiber పోస్ట్‌పెయిడ్: రూ. 599, రూ. 899 లేదా అంతకంటే ఎక్కువ..
- JioFiber ప్రీపెయిడ్: రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ
యాప్ డౌన్ లోడ్ చేసుకున్నవారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ని ఉపయోగించి JioFiber/ JioAirfiberతో JioTV+ యాప్‌కి లాగిన్ అవ్వాలి. ఒకసారి, మీరు అలా చేస్తే, మీకు OTP వస్తుంది, ఆపై ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
ఇదిలా ఉండగా Jio అపరిమిత 5G డేటా యాక్సెస్‌తో చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. 198 ధరతో, ఈ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్ 14 రోజుల చెల్లుబాటుతో అపరిమిత కాలింగ్‌తో పాటు 2GB రోజువారీ 4G డేటాను అందిస్తుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..