Tirupati Laddu : అయోధ్య బాలరాముడి కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు వెళుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే టీటీడీ.. అయోధ్య రామాలయం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు వీవీఐపీలు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డులు (Tirupati Laddu) పంపిస్తున్నామని తెలిపారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుంది. అయోధ్యలో జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారంభోత్సవానికి యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
మరికొద్ది రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన అయోధ్య రామాలయం భక్తులకు అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. మరోవైపు, తిరుపతి ట్రస్ట్ అయోధ్య లోనూ లార్డ్ వేంకటేశ్వర దేవాలయం ప్రతిరూప ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకించి టీటీడీ ట్రస్టు వారి వెంకటేశ్వర ఆలయాలను నిర్మించాలని భావిస్తున్న టీటీడీ.. ఇప్పటికే జమ్మూ, న్యూఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని కురుక్షేత్ర లో ఆలయాలను నిర్మించింది..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..