వెల్లింగ్టన్: న్యూజిలాండ్ (New Zealand) లో మావోరి తెగకు చెందిన 21 ఏళ్ల మహిళా ఎంపీ హనా రాహితి మైపి క్లార్క్ మొదటి సారి పార్లమెంట్‌కు ఎన్నికైంది. 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అతి పిన్న వయస్సులో ఎంపికైన నేతగా ఆమె రికార్డు నమోదు చేశారు. గత సంవత్సరం అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో మైపిక్లార్క్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. హౌరకి వైకాటో స్థానం నుంచి ఎంపీగా ఆమె విజయం సాధించారు. న్యూజిలాండ్ లోని స్థానిక తెగ మావోరిల సంక్షేమం కోసం మైపి క్లార్క్ చాలా ఏల్లుగా నుంచి పోరాటం చేస్తున్నారు.
కాగా పార్లమెంట్‌లో తొలిసారి ప్రసంగం చేసిన మైపి క్లార్క్.. మావోరి భాషలో మాట్లాడారు. తీవ్ర భావోద్వేగానికి లోనైన ఆమె చాలా ఆవేశపూరితంగా మావోరి స్వరాన్ని వినిపించారు. ‘మీ కోసం చస్తా.. కానీ మీ కోసం కూడా జీవిస్తాను’ అని ఆమె తన ప్రసంగంలో వివరించారు. మావోరిలో తమ భాషలో మాట్లాడుతుంటే.. ఎలాంటి సంకేతాలు ఇస్తారో.. అలా ఆమె పార్లమెంట్ సమావేశంలో మాట్లాడుతూ అందరినీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు.
అయితే New Zealand లోని ఆక్లాండ్, హామిల్టన్ నగరాల మధ్య ఉన్న చిన్న పట్టణం హంట్లే ఆమె సొంత వూరు. ఇక్కడ ఆమె మావోరి కమ్యూనిటీ గార్డెన్ ను నడిపిస్తోంది. మొక్కల పెంపకంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తున్నారు. చంద్రమానం క్యాలెండర్ ప్రకారం.. మావోరిలు గార్డెనింగ్ చేస్తుంటారు. మావోరి తెగ ప్రజల స్వరాన్ని పట్టించుకోవాలని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు..
New Zealand natives’ speech in parliament pic.twitter.com/OkmYNm58Ke
— Enez Özen | Enezator (@Enezator) January 4, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..