Lok Sabha Elections : తాను ఇస్లాం మతాన్ని లేదా ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసేటపుడు ప్రతీఒక్కరూ వారి భవిష్యత్తు, ఎదుగుదల గురించి సమాజం గురించి ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రయోజనాల కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు మోదీతోపాటు బీజేపీ (BJP)పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇటీవలి ప్రసంగంలో మోడీ ‘ఎక్కువ మంది పిల్లలు’ ‘చొరబాటుదారులు’ అనే పదాలను వాడడంతో ఆయనపై ఇండి కూటమి నాయకులు విమర్శలు గుప్పించారు.
ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వారు నెహ్రూ కాలం నుంచి ఈ కథనాన్ని మళ్లీ మళ్లీ వండి వార్చుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ మమ్మల్ని ముస్లిం వ్యతిరేకులుగా దూషిస్తూనే ఉన్నారు. రెండవది వారు ముస్లింల స్నేహితులమని చెప్పుకుంటారు. దీని ద్వారా వారు లబ్ధి పొందుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. వారు భయాందోళనలతో లాభాలను పొందుతున్నారు. కానీ ముస్లిం సమాజానికి ఇప్పుడు అవగాహన వచ్చింది. నేను ట్రిపుల్ తలాక్ (Triple Talaq) ను రద్దు చేసి, ఆ పద్ధతికి స్వస్తి పలికినప్పుడు.. ముస్లిం సోదరీమణులు ఎంతో సంతోషించారు. నేను వారి మనిషినని గుర్తించారు. నేను ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇచ్చినప్పుడు.. నేను వారి నిజమైన మనిషినని చెబుతారు. నేను ఎవరి పట్ల వివక్ష చూపడం లేదని వారు గ్రహించారు. ప్రతిపక్షాల సమస్య ఏమిటంటే వారు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోయాయి. అందుకే తప్పుదోవ పట్టించేందుకు, తనను ముస్లిం వ్యతిరేకిగా ముద్రవేయడానికి వారు రకరకాల అబద్ధాలు చెబుతూనే ఉండాలి’’ ప్రధాని మోదీ అన్నారు.
ముస్లిం రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు
PM modi On Muslims reservations : “ముస్లిం సమాజానికి నేను చెప్పాలనుకుంటున్నాను: ఆత్మపరిశీలన చేసుకోండి, ఆలోచించండి. దేశం అభివృద్ధి చెందుతోంది, మీ సంఘంలో ఏదైనా లోటుపాట్లు అనిపిస్తే, దాని వెనుక కారణం ఏమిటి? కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మీకు ప్రభుత్వ ప్రయోజనాలు ఎందుకు రాలేదు. ?” మోదీ ప్రశ్నించారు. ‘మీ పిల్లలు, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి’ అని ముస్లింలు, ఎన్నికలను ఉద్దేశించి మోదీ అన్నారు. “ముస్లింలకు రిజర్వేషన్లు (Muslims reservations) రావు అని నేనెప్పుడూ చెప్పలేదు. రిజర్వేషన్ కల్పించడానికి మతం ప్రాతిపదిక కాదు అని నేను చెబుతున్నాను. దేశంలోని పేదలలో హిందువులు, క్రిస్టియన్లు మరియు పార్సీలు అందరూ ఉన్నారు. అందరూ రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందాలి. దళితులు, గిరిజనులు చాలా కాలంగా అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని, మన రాజ్యాంగ నిర్మాతలు సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని, అందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నామని మోదీ అన్నారు.
पहली बार, मैं मुस्लिम समुदाय से आत्ममंथन करने को कह रहा हूं।
आप यह सोचते रहेंगे कि सत्ता में किसे बिठाएंगे और किसे उतारेंगे, तो उसमें आप अपने बच्चों का भविष्य ही खराब करेंगे। pic.twitter.com/cOW6v7svAP
— Narendra Modi (@narendramodi) May 7, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..