Reliance Jio నుంచి వచ్చిన జియో 4G ల్యాప్‌టాప్ విద్యార్థుల కోసం మంచి ఆప్షన్. మీరు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ ల్యాప్‌టాప్‌లో ఈజీగా చేయవచ్చు. కేవలం కోడింగ్ చేయడమే కాకుండా రాయడం లేదా డాక్యుమెంట్‌లను ప్రిపేర్ చేయడం, ప్రెజెంటేషన్‌లు, ఇమెయిల్‌లను నిర్వహించడం, కాలేజీ పనులన్నింటినీ JioBookలో చేయవచ్చు, ఇది 4Gకి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయవలసిన అవసరం లేదు. రిలయన్స్ జియో దీనిని “India’s first learning book.” అని పిలుస్తోంది.
స్పెసిఫికేషన్‌లు
JioBook 4G Price and specifications: జియోబుక్ 11.6-అంగుళాల యాంటీ-గ్లేర్ HD స్క్రీన్‌తో వస్తుంది. చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. ఇది MediaTek ఆక్టా-కోర్ చిప్ ద్వారా పనిచేస్తుంది. రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ అయిన జియోఓఎస్‌పై ఈ ల్యాప్‌టాప్ నడుస్తుంది . కాగా జియో బుక్ 8+ గంటల బ్యాటరీ లైఫ్ ను అందించగలదని కంపెనీ తెలిపింది.
మీరు JioBookలో ఎడ్యుకేషనల్ ఛానెల్‌ల కోసం JioTVని యాక్సెస్ చేయవచ్చు. మీరు గేమ్‌లు ఆడాలనుకుంటే క్లౌడ్ గేమింగ్ తో JioGamesని యాక్సెస్ చేయవచ్చు.
JioBook 4G ప్రస్తుతం రెండు ఆఫర్‌లతో వస్తోంది .. ఒక సంవత్సరం పాటు క్విక్ హీల్ సబ్‌స్క్రిప్షన్, అలాగే ఒక సంవత్సరం పాటు DigiBoxx నుండి 100GB క్లౌడ్ స్టోరేజ్ ను పొందవచ్చు. కాగా జియో బుక్ లో 64GB ఇంటర్నల్ స్టోరేజ్, 4GB LPDDR4 RAM ఉంటుది. JioBook 4G డ్యూయల్-బ్యాండ్ Wi-Fi నెట్‌వర్క్‌లతో కనెక్ట్ చేయడానికి సపోర్ట్ ఇస్తుంది.
JioBook 4G ధర
JioBook 4G Price : అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 14,701కి అందుబాటులో ఉంది. అత్యంత సరసమైన ల్యాప్‌టాప్‌లో ప్రైమరీ వర్క్స్ చేయాలనుకునే వ్యక్తులకు ఇది మంచి లాప్‌టాప్ గా ఉంటుంది. డేటా కోసం 4G నెట్‌వర్క్‌తో పనిచేయడం వల్ల దీనికి Wi-Fi కనెక్టివిటీ అవసరం లేదు.
Jio book కొనుగోలు కోసం క్లిక్ చేయండి
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..