Home Career TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్...

TG SSC Exams Fee 2025 : పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల – ముఖ్యమూన‌ తేదీలు..

0
8
SSC Exams
SSC Exams
Spread the love

SSC Exams | తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు కీలక ప్ర‌క‌ట‌న వొచ్చేసింది. పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించుకునేందుకు ప్ర‌భుత్వం షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఎలాంటి రుసుం లేకుండా నవంబర్ 18 వరకు ఫీజు చెల్లించుకునే అవకాశం కల్పించింది. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకోవచ్చని ప్రకటనలో పేర్కొంది. ఈ సంవ‌త్స‌రం ప‌దో త‌ర‌గ‌తి చదువుతున్న విద్యార్థులతో పాటు బ్యాక్ లాగ్‌లు ఉన్న విద్యార్థులు ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 18వ తేదీ వరకు చెల్లించుకోవచ్చు. గడువు దాటితే… రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 2 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు. డిసెంబర్‌ 12 వరకు రూ. 200 ఆలస్య రుసుంతో ఫీజు చెల్లించవచ్చు. అలాగే రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్‌ 21 వరకు చెల్లించుకునే చాన్స్ ఉంటుంది.

రెగ్యూలర్ విద్యార్థులు అన్ని పేపర్లకు కలిపి రూ. 125 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు పేపర్లలోపు బ్యాక్ లాగ్‌ ఉంటే రూ.110 చెల్లించాలి. మూడు పేపర్ల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులు రూ.125 చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్ ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షల ఫీజు షెడ్యూల్ ఇదీ

AP SSC Exams ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు షెడ్యూల్ ను విడుద‌ల చేస్తూ ప్రభుత్వ పరీక్షల విభాగం నోటిఫికేషన్ ను జారీ చేసింది. నవంబర్ 11వ తేదీని తుది గడువులోపు ప‌రీక్ష‌ఫీజుల‌ను చెల్లించుకోవాలి. నవంబర్ 12వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీల్లో రూ.50 ఆల‌స్య రుసుముతో చెల్లించాలి. ఇక నవంబర్ 19 నుంచి 25వ తేదీల్లో చెల్లిస్తే… రూ.200 అదనపు రుసుముతో చెల్లించాలి. అలాగే రూ.500 ఆలస్య రుసుముతో నవంబర్ 26 నుంచి నవంబరు 30 వరకు ప‌రీక్ష ఫీజును చెల్లించుకునే అవ‌కాశం క‌ల్పించారు.

పూర్తి వివ‌రాల‌కు అధికారిక వెబ్ సైట్ – https://bse.ap.gov.in/ ను సంప్ర‌దించ‌వ‌చ్చు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125 చెల్లించాలి. ఇక సప్లిమెంటరీ అభ్యర్థులు అయితే… 3 పేపర్ల వరకు రూ.110 చెల్లించాలి. అంతకంటే ఎక్కువ ఉంటే రూ.125 చెల్లించాల్సి ఉంటుంది.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here