Friday, January 23Thank you for visiting

Trending News

trendingnews trending, trendingnow, trendingtopics, india, trendingmemes latestnews, trendingfashion, breakingnews, fashion, trendingvideo trendings, trendingpost, trendingdances, trendingstyle #trendingtopics #viral #bollywood #currentaffairs #dailynews #trendingvideos #trendingpku #follow #trendingatsephora #celebrity #bollywoodnews #love #newsupdate #worldnews

చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​

చంద్రయాన్​–3 సక్సెస్​.. జాబిలమ్మపై సేఫ్​గా ల్యాండ్​ అయిన విక్రమ్​

Trending News
 Chandrayaan-3 Live : అంతరిక్షంపై ఇండియా సంచలనం సృష్టించింది. దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చంద్రయాన్ 3 చంద్రుడిపై సురక్షితంగా దిగింది. ఒక్కో దశ దాటుకుంటూ ల్యాండర్​ విక్రమ్​ చందమామను చేరుకుంటుంటే బెంగళూరు ఇస్రో కేంద్రంలో చప్పట్లు, కేరింతలు మారుమోగుతున్నాయి. అది చూసిన జనాల మోముల్లోనూ అమితానందం వెల్లివిరిసింది. చంద్రయాన్​3 సేఫ్​గా ల్యాండింగ్​ కావడంతో అందరూ హమ్మయ్య.. అంటూ ఊపిరిపీల్చుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చం ద్రయాన్ -3 ప్రాజెక్టు దిగ్విజయమైంది. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషికి తగ్గ ఫలితం లభించింది. జాబిలి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్​ అయ్యింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ నిర్ణీత సమయానికి చంద్రుడిని చేరుకుంది. సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో శాస్త్రవేత్తలు టెన్షన్​ కు గురయ్యా...
Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Trending News
Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమైంది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత తదుపరి మిషన్. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగష్టు 6, 9, 14, 16వ తేదీలలో అలాగే ఆగస్టు 17న రోవర్, ల్యాండర్.. రెండు మాడ్యూళ్ళను వేరు చేయడానికి ముందు కక్ష్య తగ్గించే విన్యాసాలు జరిగాయి. Chandrayaan 3 soft landing : ఈరోజు ఏం జరగనుంది? సాఫ్ట్ ల్యాండింగ్ (soft landing ) అంటే అంతరిక్ష ...
రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో ‘శుభ ముహూర్తం’ ఫిక్స్ చేసుకున్న దొంగలు

రూ.కోటి సొత్తు చోరీకి జ్యోతిష్యుడితో ‘శుభ ముహూర్తం’ ఫిక్స్ చేసుకున్న దొంగలు

Trending News
చివరకు పోలీసులకు చిక్కిన ఐదుగురు నిందితులు మహారాష్ట్రలోని బారామతిలో ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. కొందరు దొంగలు ఓ ఇంట్లో రూ.కోటి విలువైన సొత్తును దోచుకునేందుకు నిర్ణయించుకున్నారు. అది కూడా శుభ మహూర్తంలో చేయాలనుకునున్నారు. ఈ క్రమంలో ఆ దొంగల బృందం ఓ జ్యోతిష్యుడిని సంప్రదించి అతడికి ఫీజుగా రూ.8 లక్షలు చెల్లించింది. అయితే అదృష్టం కలిసిరాకపోవడంతో చోరీ జరిగిన నాలుగు నెలల తర్వాత దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాలకు పెంపించివేశారు. వారి వద్ద నుంచి రూ.76లక్షల విలువైన బంగారం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం అంటే ఏప్రిల్ 21న బారామతిలోని దేవకట్ నగర్ ప్రాంతంలో ఈ దోపిడీ జరిగింది. నిందితులను సచిన్ అశోక్ జగ్ధానే, రైబా తానాజీ చవాన్, రవీంద్ర శివాజీ భోంస్లే, దుర్యోధన్ ధనాజీ జాదవ్, నితిన్ అర్జున్ మోరేగా గుర్తించారు. వీరంతా కూలీ కార్మికులు" అని సీనియర్ పోలీసు అధికారి అంకిత్ గ...
Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Trending News
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది..చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూ...
Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..

Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..

Trending News
Gold and Silver Price Today : జూలై నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూవస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. అయితే తాజాగా ఈ ధర రూ. 54,100 వద్ద కొనసాగుతోంది. గత నెలరోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,300 గా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శుభముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 54,100 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు...
భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు

భారీ వర్షాలతో తెగిన రోడ్లు.. గర్భిణిని కొండలు దాటుకొని కుర్చీపై హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లిన గ్రామస్థులు

Trending News
డెహ్రాడూన్: ఉత్తరఖండ్ లో భారీ వర్షాల(heavy rains) కారణంగా ఈ వారం చమోలిలో కొండచరియలు విరిగిపడడంతో రహదారులన్నీ తెగిపోయాయి. దేవల్ ప్రాంతంలోని బాన్ గ్రామంలోని స్థానికులు తమకు ఉన్న ఏకైక రహదారిని కోల్పోయారు. ఈ క్రమంలోనే 29 ఏళ్ల కిరణ్ దేవికి ప్రసవ నొప్పులు రావడం మొదలైంది. దీంతో కొంతమంది గ్రామస్థులు ఆమెను ప్లాస్టిక్ కుర్చీపై ఉంచి, తమ భుజాలపై పైకి లేపి, కనుమలు, కొండ ప్రాంతాల శిథిలాల మీదుగా కాలినడకన ఎంతో శ్రమించి చమోలి (Chamoli)లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మోసుకెళ్లారు. చివరికి ఆరోగ్యకేంద్రంలో వైద్యుల పర్యవేక్షణలో కిరణ్ గురువారం అర్థరాత్రి మగబిడ్డను ప్రసవించింది. అయితే ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కొండ ప్రాంతాల ప్రజలు పడుతున్న అవస్థలను ఇది వెలుగులోకి తెచ్చింది. ఇలాంటి వర్షం ఎప్పుడూ చూడలేదు... "దేవాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(PHC) మా గ్...
ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు

ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసిన ఏఎస్పీ.. షాకిచ్చిన ఉన్నతాధికారులు

Trending News
ఓ పోలీసు అధికారి ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఏకంగా ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. చివరకు క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. ఉత్తరఖండ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ కోట్‌ద్వార్‌లోని విపత్తు ప్రాంతాలను సందర్శించాడు. అదే సమయంలో కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.ముఖ్యమంత్రి హెలికాప్టర్ నుండి దిగగానే, కోట్‌ద్వార్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) శేఖర్ సుయాల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఆయనకు సెల్యూట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఈ వైరల్ వీడియో పై అధికారులు తక్షణమే స్పందించారు. ASPని నరేంద్ర నగర్‌లోని పోలీస్ శిక్షణా కేంద్రానికి బదిలీ చేశారు.ఈ సంఘటన ...
Bajaj Ledz Inverter Lamp : కరెంటు పోయినా 4 గంటలు వెలుగుతుంది..

Bajaj Ledz Inverter Lamp : కరెంటు పోయినా 4 గంటలు వెలుగుతుంది..

Trending News
వర్షాకాలంలో తరచుగా కరెంటు కోతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కరెంటు పోయినప్పుడు ఎంతో చికాకును కలిగిస్తుంది. అలాంటి సందర్భంలో చార్జింగ్ లైట్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.ఎమర్జెన్సీ లైట్లకు సంబంధించి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ  బజాజ్ కంపెనీ LEDZ పేరుతో 8.5W Cfl రీఛార్జబుల్ ఎమర్జెన్సీ ఇన్వెర్టర్ LED బల్బును విడుదల చేసింది. తెల్లని ప్రకాశవంతమైన వెలుతురునిచ్చే ఈ బల్బు.. కరెంటు లేకపోయినా కూడా 4 గంటలపాటూ వెలుగుతుది. కరెంటు వచ్చిన తర్వాత ఈ లాంప్ తిరిగి దానంతట అదే రీఛార్జ్ అవుతుంది. ఫుల్ గా రీఛార్జింగ్ అయ్యాక.. తనకు తానుగానే ఛార్జ్‌ను ఆపేసుకునే టెక్నాలజీ ఈ బల్బ్ లో ఉంది. ఇది 9 వాట్ల బల్బు. బరువు 145 గ్రాములు ఉంటుంది. ఇది ‎A15 షేప్‌ సైజులో ఉంటుంది. దీని బ్రైట్‌నెస్ 900 ల్యూమెన్‌గా ఉంది. ఇది పొడవు 7, వెడల్పు 7, ఎత్తు 14 సెంటీమీటర్లు ఉం...
Gold and silver rates today :  స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి లెక్కలివే!

Gold and silver rates today : స్థిరంగా పసిడి, స్వల్పంగా తగ్గిన వెండి ధర.. నేటి లెక్కలివే!

Trending News
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ. 54,650 వద్ద కొనసాగుతోంది. సోమవారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.5,46,500 కి చేరింది. ఒక గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ.5,465 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం.. ఇక 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర సైతం స్థిరంగా ఉంది. ప్రస్తుతం ఈ ధర రూ.59,620 గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల (24క్యారెట్లు) పసిడి ధర రూ.5,96,200గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 5,962గా ఉంది.ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,800గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,760గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,650 పలుకుతో...
ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

ఇంటిలో నగలు చోరీ చేసి కులాసాగా ట్రావెల్ వీడియోలు.. అవే వీడియోలతో పోలీసులకు దొరికిపోయాడు..

Trending News
న్యూఢిల్లీలోని ఒక ఇంట్లో దొంగతనం చేసి దర్జాగా తిరిగాడు.. తీరా అతడు చేసిన ట్రావెల్ వీడియోలతో సులభంగా పోలీసులకు చిక్కాడు.బిందాపూర్‌కు చెందిన సంజీవ్ (29) జూలై 11న న్యూఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన ఒక నెల తర్వాత, అతని ట్రావెల్ వ్లాగ్‌ల ద్వారా పోలీసులు అతడు ఉన్న చోటును ట్రాక్ చేశారు. ఆగ్రాలో ఉండగా దొంగను అరెస్టు చేసినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. అంతకుముందు తన ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఇంటి యజమాని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.విచారణలో భాగంగా పోలీసులు సమీపంలోని ప్రదేశాలలోని సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించారు .. నిందితుడు సంజీవ్ చోరీ చేసిన ఇంటి నుండి బయటకు వెళ్లడం కనిపించింది. అతడి చివరి ప్రదేశం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్నట్టు గుర్తించారు. అతడిని ఎవరూ గుర్తించకుండా ఉండటానికి అతను తన మొబైల్ ...