Gold and Silver Price Today : జూలై నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూవస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. అయితే తాజాగా ఈ ధర రూ. 54,100 వద్ద కొనసాగుతోంది. గత నెలరోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,300 గా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శుభముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారు.
హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర..
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 54,100 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10గ్రాములకు రూ. 54,200 వద్ద ఉంది. ఇక న్యూఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 54 వేల 250 వద్ద ఉండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు తులానికి రూ. 59,170 వద్ద కొనసాగుతోంది.
మళ్లీ స్వల్పంగా తగ్గిన వెండి ధర..
బంగారం ధర గత 3 రోజులుగా స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి రేటు మాత్రం ఈరోజు స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.200 తగ్గింది. ప్రస్తుతం కిలో రేటు రూ.76,500 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 200 తగ్గి ప్రస్తుతం రూ.73,300 మార్క్ వద్ద కొనసాగుతోంది. దీనిని బట్టి న్యూఢిల్లీతో పోలిస్తే హైదరాబాద్ లో బంగారం ధర తక్కువగా, వెండి ధర ఎక్కువగా ఉంటుంది. అందుకు ఆయా ప్రాంతాల్లోని ట్యాక్స్ లు, కమీషన్లు వంటి ఇతర అంశాలు కారణమవుతాయి.
ధరల్లో మార్పులు ఎందుకు?
బంగారం, వెండి, ప్లాటినం వంటి అలంకరణకు సంబంధించిన లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాలపై ఈ ధరల మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్స్ లో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ఈ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.