Orange Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనగానే తెలుపు-నీలిరంగు బోగీలు గుర్తుకొస్తాయి. అయితే.. భారతీయ రైల్వే కొత్తగా నారింజ తెలుపు రంగుతో.. కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కూడా వివిధ మార్గాల్లో నడిపించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ దిశగా అడుగు వేస్తూ ఆరెంజ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) తయారు చేసిన ఈ కొత్త రేక్‌ను ట్రయల్ రన్ కు ముందుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పరిశీలించారు.
కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ట్రయల్ రన్ ను ICE, పాడి రైల్వే ఫ్లైఓవర్ మధ్య రూట్ లో నిర్వహించారు.. ఐసీఎఫ్ రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఇది 33వ రేక్ కావడం గమనార్హం. ఈ రైలులో రంగుతోపాటు అనే కొత్త ఫీచర్లను జోడించారు. దీంతో ప్రయాణికులు ఇంతకుముందు కంటే మరిన్ని సౌకర్యాలు పొందనున్నారు. అవేంటంటే..?
- వందేభారత్‌లో సీటు గతంలో కంటే సౌకర్యవంతంగా.. మరింత మెత్తగా ఉంటుంది.
- సీట్ రిక్లైనింగ్ యాంగిల్‌ను కూడా పెంచారు.
- ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ని సీట్ల రంగు ఎరుపు నుంచి గోల్డ్, బ్లూ రంగులో ఉంటాయి.
- వాష్ బేసిన్ లోతు ఎక్కువ ఉంటుంది.
- ఛార్జింగ్ పాయింట్ గతంలో కంటే మెరుగ్గా పని చేస్తుంది
- మరుగుదొడ్లలో లైట్(కాంతిని) 1.5 నుంచి 2.5 వాట్లకు పెంచారు.
- టాయిలెట్ హ్యాండిల్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి.
- కర్టెన్లు గతంలో కంటే బలంగా ఉంటాయి.
- కుళాయిలో నీటి ప్రవాహం కూడా మెరుగ్గా ఉంటుంది.
- ఏసీ బాగా వచ్చేందుకు గాలిరాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకున్నారు.
25 రూట్లలో..
ప్రస్తుతం, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ భారతదేశంలోని 25 మార్గాల్లో సేవలు అందిస్తోంది, వివిధ రైల్వే జోన్‌లలో రాజధాని నగరాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతుంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, భోపాల్, లక్నో, గాంధీనగర్, తిరుపతి, విశాఖపట్నం, మైసూరు, హౌరా, న్యూ జల్పైగురి, షిర్డీ, కోయంబత్తూర్, గౌహతి, డెహ్రాడూన్, జైపూర్, జోధ్‌పూర్, త్రివేండ్రం వంటి నగరాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కనెక్టివిటీ ఉంది.
అపూర్వ ఆదరణ
ఫిబ్రవరి 15, 2019న, న్యూఢిల్లీ – వారణాసి మధ్య నడిచే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో ఉత్పత్తి చేయబడిన రైలు సెట్ “మేక్ ఇన్ ఇండియా” ఉద్యమానికి ఊతం ఇస్తోంది. అలాగే.. భారతదేశలో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
అయితే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కూడా స్లీపర్ కోచ్‌లతో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త కోచ్‌లు రాత్రిపూట ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. ఇంకా, అనేక రైల్వే జోన్‌లలో రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానంలో ఈ రైళ్లు భర్తీ చేస్తాయనే అంచనాలు ఉన్నాయి.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.