Summer Special Trains సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు వేసవి ప్రత్యేక రైళ్లు
Secunderabad: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ నుంచి పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను (Summer special trains ) నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ముఖ్యంగా కేరళలోని కొల్లం, పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్ (Shalimar), సాంత్రాగాచి ప్రాంతాలకు వేసవి ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించారు.
సికింద్రాబాద్-సాంత్రాగాచి రైలు
సికింద్రాబాద్-సాంత్రాగాచి (Santragachi) (07223) రైలు ప్రతీ శుక్రవారం బయలుదేరుతుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 29 వరకు మొత్తం 11 ట్రిప్పులు నడుస్తుందని తెలిపారు. ప్రతీ శనివారం తిరుగు ప్రయాణమయ్యే సాంత్రాగాచి-సికింద్రాబాద్ (07224) రైలు ఏప్రిల్ 20 నుంచి జూన్ 29 వరకు 11 ట్రిప్పులు నడుస్తుందని వివరించారు.రైలు ఆగే స్టేషన్లు : సికింద్రాబాద్-సాంత్రాగాచి (07223) రైలు నల్గొండ, మిర్యాలగూడ స్టేషన్ల లో ఆగుతుందన...