Saturday, January 24Thank you for visiting

Telangana

telangana hyderabad andhrapradesh india telugu telugumemes mumbai kerala tollywood delhi chennai instagram warangal hyderabadi #karnataka #vijayawada #vizag #tamilnadu #trending #maheshbabu #love #prabhas #maharashtra #pawankalyan #telugucinema #alluarjun #bangalore #vijaydevarakonda #telugucomedy #kolkata

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

TGSRTC | ఆర్టీసీలో త్వరలో 3 వేల ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం

Telangana
TGSRTC | కరీంనగర్‌: తెలంగాణ‌లోని నిరుద్యోగ యువ‌త‌కు రాష్ట్ర‌ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వ‌ర‌లో ఆర్టీసీ (TGSRTC) లో 3000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈమేర‌కు ఆదివారం కరీంనగర్ (Karimnagar)  జిల్లా కేంద్రంలో నుంచి 33 ఎల‌క్ట్రిక్‌ బస్సులను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ (Ponnam Parbhakar)  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త‌మది ప్రజాపాలన అని, అన్నారు. ఇప్పటివరకు ఎంతో మంది మహిళలు మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్ల‌డించారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలను అమ‌లు చేస్తామ‌ని తెలిపారు.కాగా విద్యుత్‌ బస్సుల (Electric Buses)  కొనుగోలుకు జేబీఎం సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంద‌ని మంత్రి ...
దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు..  హైదరాబాద్​ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!

దట్టమైన అడవి మీదుగా శ్రీశైల మ‌ల్ల‌న్న‌కు.. హైదరాబాద్​ – శ్రీశైలం మధ్య 55 కి.మీ. భారీ ఫ్లై ఓవర్!

Andhrapradesh, Telangana
Elevated Corridor Srisailam : ప్ర‌సిద్ధ‌ శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. హైదరాబాద్​ నుంచి శ్రీశైలం రోడ్డు మార్గంలో పెద్ద పెద్ద కొండ‌లు, ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపులు దాడుకుని వెళ్లడం ఎంతో కష్టంగా ఉండేది. హైదరాబాద్​ దాటగానే చుట్టూ దట్టమైన నల్లమల అడవిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్ర‌మాద‌క‌ర‌మైన మ‌లుపుల మ‌ధ్య‌ వాహనాల‌ వేగం మాత్రం 30 నుంచి 40 కిలోమీటర్లు దాట‌డానికి వీలు లేదు. ఒకవేళ వాహన వేగం పెరిగితే జరిమానాలు చెల్లించాల్సిన ప‌రిస్థితి. పైగా రాత్రివేళల్లో ప్రయాణం పూర్తిగా నిషేధం. మ‌రోవైపు ద‌ట్ట‌మైన కీకార‌ణ్యం మ‌ధ్య సొంత వాహనాల్లో వెళ్లాలంటే వన్యప్రాణుల భయం కూడా ఉంది. ఇలాంటి సమస్యల నుంచి భక్తులకు విముక్తి క‌ల్పించేందుకు తెలంగాణ స‌ర్కారు కొత్త ప్రతిపాదన చేసింది. 55 కిలోమీటర్ల పొడవైన భారీ వంతెన (Elevated Corridor Srisailam Highway) ను నిర...
Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..

Hyderabad News | కేబీఆర్ పార్క్ చట్టూ ఆరు జంక్షన్లు.. ఇక ట్రాఫిక్ చిక్కుల‌కు చెల్లు..

Telangana
Hyderabad News : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో న‌గ‌ర‌వాసుల‌కు ట్రాఫిక్ చిక్కుల‌ను దూరం చేయ‌డానిక ప్ర‌భుత్వం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టింది. న‌గ‌రంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఆరు జంక్షన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌లు చేసింది. రూ. 826 కోట్లతో ఆరు జంక్షన్ల అభివృద్ది కోసం సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఆమోదం తెలిపారు. ఈ ఆరు జంక్షన్ల నిర్మాణానికి సంబంధించిన నమూనా వీడియోలను జీహెచ్‌ఎంసీ విడుదల చేసింది. హెచ్‌ సీఐటీఐ (HCITI) ప్రాజెక్టులో భాగంగా జీహెచ్‌ఎంసీ (GHMC) ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయనుంది. రెండు ప్యాకేజీలుగా ఆరు జంక్షన్లను అభివృద్ధి చేయ‌నున్నారు.మొదటి ప్యాకేజీలో రూ. 421 కోట్లతో జూబ్లీ హిల్స్‌ చెక్‌ పోస్ట్‌ జంక్షన్‌, కేబీఆర్‌ ఎంట్రన్స్ జంక్షన్‌, రెండో ప్యాకేజీలో రూ. 405 కోట్లతో రోడ్డు నెంబ‌ర్‌. 45 , ఫిల్మ్‌ నగర్‌ జంక్షన్, మహారాజా అగ్రసేన్‌ జంక్షన్, క్యాన్సర్‌ అస్పత్రి జంక్షన్లను జీహెచ్‌...
Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు

Hyderabad Flights | హైద‌రాబాద్ నుంచి అయోధ్య‌కు నేరుగా విమానాలు

Telangana
RGIA నుంచి ఏడు కొత్త డైరెక్ట్ విమానాలు ప్రారంభం Hyderabad Flights | విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న హైద‌రాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది. ఈ విమాన స‌ర్వీసులు సోమ, బుధ, శుక్రవారాలు, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా విమాన సర్వీసులను స్పైస్‌జెట్ నిలిపివేసింది. ఈ క్ర‌మంలో మూడు నెలల విరామం తర్వాత ఈ కొత్త సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి యూపీలోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు తన డైరెక్ట్ విమానాన్ని ప్రారంభించింది. ఎయిర్‌లైన్స్ సెప్టెంబర్‌లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి ఏడు డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రారంభించింది . RGIA నుంచి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ న‌గ‌ర...
Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?

Registration Charges | నవంబర్‌లో రిజిస్ట్రేషన్ పెంచనున్న ప్రభుత్వం?

Telangana
Registration Charges | తెలంగాణ‌లో రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. నవంబర్‌ నుంచి సవరించిన చార్జీలను అమ‌లు చేయనున్న‌ట్లు తెలుస్తోంది. అయితే నిజానికి వ్యవసాయ, వ్యవసాయేతర, స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల‌కు కొత్త ధరలను ఆగస్టు 1 నుంచే అమలు చేయాలని భావించి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జూన్‌లో షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. అధికారులు జిల్లాల్లో అధ్యయనం చేసి ప్రభుత్వానికి జూలైలో నివేదిక అంద‌జేశారు. కాగా ప్రభుత్వం ఈ నివేదికను ఆమోదించ‌లేదు. ఈ క్ర‌మంలో ధరల సవరణపై అధ్యయన బాధ్యతలను ఒక‌ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించింది. రాష్ట్రవ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల విలువను అధ్యయనం చేసి, ఎక్కడ ఎంత మేర‌కు పెంచే అవకాశం ఉందో, ఎక్కడ తగ్గించాల్సి ఉంటుందో సూచించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేట్‌ సంస్థ అధ్యయనం తుది దశకు చేరిందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల ద్వారా తెలిసింది.హైద‌రాబాద్ ర...
South Central Railway | దసరా, దీపావళికి సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు..

South Central Railway | దసరా, దీపావళికి సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లు..

Telangana
South Central Railway | దసరా, దీపావళి పండుగల దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దసరా, దీపావళి,  ఛత్ పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే వివిధ నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.కాచిగూడ - తిరుపతి స్పెషల్ ట్రైన్దీని ప్రకారం, రైలు నంబర్ 07063/07064 కాచిగూడ-తిరుపతి-కాచిగూడ రైలు 14 సర్వీసులు నడపబడతాయి. రైలు నెం.07063 కాచిగూడ-తిరుపతి అక్టోబరు 1, 8, 15, 22,  29 మరియు నవంబర్ 5,  12 తేదీల్లో మంగళవారాల్లో అందుబాటులో ఉంటుంది.  అలాగే రైలు నెం.07064 తిరుపతి-కాచిగూడ రైలు  అక్టోబరు 2, 9, 16, 23, 30వ తేదీలతోపాటు మరియు నవంబర్ 6 మరియు 13వ తేదీల్లో ప్రతీ బుధవారం నడుస్తుంది. హాల్టింగ్ స్టేషన్స్..ఈ ప్రత్యేక రైళ్లు ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగ...
త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

త్వరలోనే అంద‌రికీ డిజిటల్ హెల్త్ కార్డులు

Telangana
Digital Health Cards : రాష్ట్రంలో అంద‌రికీ డిజిట‌ల్ హెల్త్ కార్డులు అంద‌జేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)  తెలిపారు. ప్రాణాంతక క్యాన్స‎ర్‎ మహ్మమారితో ఎంతో మంది చనిపోతున్నారని.. ఈరోజు కూడా ఒక‌ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని అన్నారు. హైదరాబాద్‎ విద్యానగర్ లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు.తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ త‌యారు చేసి త‌ద్వారా ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అంద‌జేస్తామ‌ని, రాష్ట్రంలోని పేదలంద‌రికీ నాణ్య‌మైన‌ వైద్యం అందుబాటులోకి తెస్తామని.. చెప్పారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంద...
Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Double Bedroom House | వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి నుంచే ప్రక్రియ షురూ..

Telangana
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మూసీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో నిర్వాసితుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా అండ‌గా ఉంటామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జ‌రిగిన స‌మీక్ష స‌మావేశంలో కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితుల‌ను తీసుకురావొద్ద‌ని సూచించారు. పేద‌ల‌కు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు.హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాల‌ని సూచించారు. ...
సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!

సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్ టైమింగ్స్ మారాయ్‌..!

Telangana
Secundrabad Nagpur Vande Bharat Timings | సికింద్రాబాద్‌ – నాగ్‌పూర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణ సమయంలో స్వల్ప మార్పులు చేసిన‌ట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే చంద్రాపూర్‌ స్టాప్‌ సమయంలో మార్పులు చేసిన‌ట్లు తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. రైలు సాయంత్రం 5.33 గంటలకు చంద్రాపూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొని 5.35 గంటలకు బయలుదేరాల్సి ఉండ‌గా ఇక నుంచి ఈ రైలు 5.43 గంటలకు చేరుకొని.. 5.45 గంటలకు బయలుదేరుతుందని తెలిపింది. ఈ మార్పు అక్టోబరు 3వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. మిగతా రైల్వేస్టేషన్ల సమయంలో ఎలాంటి మార్పులు లేవని ద‌క్షిణ మ‌ధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని కోరింది.కాగా, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్‌- సికింద్రాబాద్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలు 19 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వ...
రూ.170 కోట్లతో కరీంనగర్ – హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి..

రూ.170 కోట్లతో కరీంనగర్ – హుస్నాబాద్ మధ్య నాలుగు లైన్ల రహదారి..

Telangana
Karimnagar - Husnabad Road | సిద్దిపేట, , కరీంనగర్ జిల్లా వాసులకు శుభవార్త.. త్వరలో సిద్ధిపేట జిల్లా కేంద్రం నుంచి హన్మకొండ జిల్లా ఎల్కతుర్తికి రూ.170 కోట్లతో నాలుగు లైన్ల రహదారిని నిర్మించనున్నామని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెల్లడించారు. హుస్నాబాద్‌ ‌ప్రాంతం కరీంనగర్‌, ‌హన్మకొండ, జనగామ, సిద్దిపేట పట్టణాలకు 30 నుంచి 40 కిలోమీటర్ల లోపే ఉందని, ఇప్పటికే సిద్దిపేట - ఎల్కతుర్తి మధ్య ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్డు నిర్మాణం పూర్తి కావస్తోందని, త్వరలోనే రూ.170 కోట్లతో హుస్నాబాద్‌ ‌కరీంనగర్‌ ‌ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి పొన్నం తెలిపారు. అంతేకాకుండా హుస్నాబాద్‌ ‌- జనగామ (Husnabad-Janagama Road మధ్య ఫోర్‌ ‌లైన్స్ ‌రోడ్‌ ‌నిర్మాణానికి ప్రతిపాదనలు చేస్తున్నామని వెల్లడించారు.  తద్వారా ఆయా జిల్లాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం  అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హుస్నాబ...