
Geyser Buying Guide : మీ ఇంటికి గీజర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..!
Geyser Buying Guide | మీ ఇంటికి బెస్ట్ గీజర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? మార్కెట్‌లో చాలా ఎన్నో కంపెనీలకు చెందిన వివిధ రకాల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. చలికాలంలో వెచ్చని నీటితో స్నానం చేసేందుకు వేగంగా, సురక్షితంగా ఉండే ఉత్తమమైన వాటర్ హీటర్‌ను ఎంచుకోవాలి. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అనేక గీజర్లు అందుబాటులో ఉన్నందున వాటిలో ఉత్తమమైనదాన్ని ఎంచుకోవడం చాలా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. గీజర్లపై ఒక అవగాహన కోసం ఈ ముఖ్య విషయాలను తెలుసకోండి..
ఇన్‌స్టంట్ గీజర్ వర్సెస్ స్టోరేజ్ గీజర్
ఇన్‌స్టంట్ గీజర్లు (Instant geysers ) కాంపాక్ట్ ఉండి నీటిని వేగంగా వేడి చేస్తాయి. ఈ గీజర్‌లను చిన్న కుటుంబాలు లేదా ఒంటరిగా ఉండేవారికి అనువుగా ఉంటాయి. అంటే రోజువారీగా తక్కువ వేడి నీరు అవసరం అయ్యేవారికి ఇన్‌స్టంట్ గీజర్లు సరిపోతాయి.స్టోరేజ్ గీజర్లు (Storage geysers) పెద్ద ట్యాంక్ సామర్థ్యంతో వస్తాయి. ఈ గీజర్...