Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!

Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!
Spread the love

Foods For Winter: చలికాలం వచ్చేసింది. ఇదే సమయంలో జలుబు వచ్చే ప్రమాదాలు ఎక్కవగా ఉంటాయి. చల్లని వాతావరణంలో మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి యత్నిస్తాం. మన శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసుకునేందుకు మనం టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కాకుండా చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు అలాగే జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి తెలుసా.. చలికాలంలో ఏయే ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం

చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పర్చడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. దీనిని రోజూ తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యం గా ఉంటుంది..

READ MORE  Geyser Buying Guide : మీ ఇంటికి గీజర్ కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి..!

నెయ్యి

నెయ్యి చాలా తేలికగా మనకు జీర్ణమవుతుంది. నెయ్యితో అనేక ప్రయోజనాలను కూడా ఉంటాయి. నెయ్యి తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇది జలుబు నుంచి కూడా కాపాడుతుంది. దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే పరిమిత పరిమాణంలో మాత్రమే నెయ్యి తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

తేనె

జలుబు, దగ్గు చికిత్సకు తేనెను చాలా సంవత్సరాలుగా ఔషధంగా ఉపయోగిస్తున్నారు. తేనె రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. మన శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరి గుణాలు కూడా ఉన్నాయి.

READ MORE  Winter Season | చలికాలంలో జలుబు బారిన పడకుండా ఈ ఫుడ్ తీసుకోవడం మర్చిపోవద్దు..

పండ్లు

ఆరెంజ్, యాపిల్, దానిమ్మ, కివీ, బొప్పాయి, జామ తదితర ఫలాలు శీతాకాలంలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మీ వ్యాధి నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. చల్లని వాతావరణంలో జలుబు, ఫ్లూ నుంచి మిమ్మల్ని రక్షిస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రతను కూడా క్రమద్ధీకరిస్తాయి. అలాగే ఈ పండ్లలో మీ మంచి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పెద్దమొత్తంలో లభిస్తాయి.

అల్లం

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించేందుకు అల్లం కూడా ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది వికారం, చక్కెరను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది.
చిలగడదుంపలు
చిలగడదుంపలు ఎంత రుచిగా ఉంటాయో అంతే ఆరోగ్యకరం కూడా… ఇమ్యూనిటీని బలోపేతం చేయడంతో పాటు ఇది మెదడుకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరానికి వెచ్చదనాన్ని కూడా ఇస్తుంది.

READ MORE  Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *