Home » Viral News : రీల్స్‌ చేసే వరడు కావలెను.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పెళ్లి ప్రకటన..
Viral News

Viral News : రీల్స్‌ చేసే వరడు కావలెను.. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ పెళ్లి ప్రకటన..

Spread the love

Viral News : కాలం వేగంగా మారుతోంది. ప్రస్తుతం అంతటా సోషల్ మీడియా హవా నడుస్తోంది. క్రియేటివిటీ హద్దు అదుపు లేకుండా పోతోంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.. ప్రపంచం మొత్తం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్‌మీడియా పుణ్యమా అని… ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా క్షణాల్లో వ్యవధిలోనే మన కళ్ల ముందు కనిపిస్తోంది. అయితే కొన్నాళ్లుగా రీల్స్‌ చేయడం యూత్ అదేపనిగా పెట్టుంటున్నారు..  వైరటీ రీల్స్‌ చేయడం.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం.. ఇప్పుడు ఇదే ట్రెండ్.‌. ఆ రీల్స్‌ వల్ల ఫాలోవర్లు పెరిగి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.

సోషల్‌ మీడియాలో కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నఫాలోవర్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీని కారణంగా రీల్సే జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. తాజాగా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన ఓ యువతి…. తనకు కాబోయే మొగుడు రీల్స్‌ కూడా చేయాలని కండిషన్‌ పెట్టింది.  వినడానికి వింతగా ఉన్నా… ఆమె ఇచ్చిన ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. అంతేకాకుండా ఆ యువతి వరుడు కోసం పెట్టిన కండిషన్స్‌ చూసి… అంతా ఆశ్చర్యపోతున్నారు.

READ MORE  Viral Video | క్రికెట్ మ్యాచ్‌పై సంస్కృతంలో కామెంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్..

వరుడు కమ్‌ రీల్స్‌ పార్ట్‌నర్‌ కోసం ప్రకటన ఇచ్చిన ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు రియా.. తన పేరు రియా అని… తాను తన జీవిత భాగస్వామి – రీల్‌ భాగస్వామి కోసం వెతుకుతున్నానని ప్రకటన ఇచ్చింది. అందులో కొన్ని కండిషన్స్‌ కూడా పెట్టింది.. అబ్బాయి కెమెరా చూసి సిగ్గుపడకూదు.. అంతేకాదు.. తనతో కలిసి రిలేషన్‌షిప్‌ రీల్స్‌ చేయాలని కూడా ఆమె స్పష్టంగా చెప్పింది. అలాగే ‘మోయి-మోయి’ వంటి ట్రెండింగ్‌ మ్యూజిక్‌లో రీల్స్ చేయడంలో అనుభవం కూడాఉండాలని ప్రకటనలో వెల్లడించింది. ఈ కండిషన్స్‌ చూసి షాక్ అయ్యారా? వీటితోపాటు ఇంకా కొన్ని షరతులు కూడా పెట్టింది రియా.

READ MORE  Video : ఇంధనం లేక రోడ్డుపై ఆగిన పోలీస్‌ వాహనం.. నిందితులతో నెట్టించిన పోలీసులు

అబ్బాయిది ఉమ్మడి కుటుంబం అయి ఉండొద్దని, ప్రకటనలో తెలిపింది. రియా. అంతేనా.. తనను సంప్రదించే ముందు అబ్బాయి అమెజాన్‌ మినీ టీవీలో ఉన్న హాఫ్ లవ్ అరేంజ్డ్‌ ప్రోగ్రామ్‌ ను తప్పకుండా చూడాలట. అతడికి ప్రీమియర్ ప్రో గురించి తెలిసి ఉండాలని, రీల్స్, వ్లాగ్‌లను చక్కగా హ్యాండిల్‌ చేయగలగాలని ప్రకటించింది. వరుడి కోసం ఇచ్చిన ప్రకటనలో.. వింత కండిషన్స్‌ చూసి అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఇవేం కండిషన్లంటూ నోరెళ్లబెడుతున్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా ఇచ్చిన ఈ వెరైటీ మ్యాట్రిమోనియల్‌ యాడ్‌ వైరల్‌ కావడంతో… అబ్బాయిల నుంచి రియాక్షన్స్‌ వస్తున్నాయి. కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి భర్త కావాలా.. ఎడిటర్‌ కావాలా అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరికొందరు రియా ప్రకటన చూసి షాకవుతున్నారు.

READ MORE  Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు శుభవార్త, శబరిమలకు ప్రత్యేక రైళ్లు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..