Mixing Urine with Juice | ఛీ.. చీ.. జూస్ లో మూత్రం కలిపిన వ్యక్తి.. చితకబాదిన స్థానికులు
Ghaziabad : ఫ్రూట్ జ్యూస్ షాపు యాజమాని జ్యూస్‌లో మూత్రం కలిపాడు. మూత్రం ఉన్న లీటర్ బాటిల్ ఆ షాపు వద్ద కనిపించింది. దీనిని చూసిన స్థానికులు సదరు షాపు యజమానిని నిలదీసి దాడిచేశారు. అనంతరం పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేయడంతో ఫ్రూట్ జ్యూస్ షాపు యాజమానిని అరెస్ట్ చేశారు. షాపులోని యూరిన్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. ఖుషీ జ్యూస్ కార్నర్ షాపు యజమాని అమీర్ ఖాన్, వివిధ పండ్ల రసాల్లో మూత్రం కలిపి (Mixing Urine with Juice) విక్రయిస్తున్నాడు. సెప్టెంబర్ 13న బాటిల్‌లో ఉన్న పసుపు రంగు ద్రవాన్ని ఫ్రూట్ జ్యూస్‌లో అతడు కలపడాన్ని కొందరు ప్రత్యక్షంగా చూశారు. ఆ బాటిల్‌ను పరిశీలించగా అది యూరిన్ అని స్పష్టమైంది. దీంతో కంగుతిన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.కాగా, జ్యూస్‌లో మూత్రం కలుపుతున్న అమీర్ ఖాన...