Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర
Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్కరను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేషన్ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67లకు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచదార పంపిణీ చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేదలకు సబ్సిడీ ధరకు కందిపప్పు చెక్కర అందిస్తున్నామని చెప్పారు. కాగా, బయట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్రస్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర ధర రూ.45కి పైగా ఉంది.1 KG కందిపప్పు రూ.67
1/2 KG పంచదార రూ.17.
నేటి నుంచి 1.48 కోట్...