Sunday, October 13Latest Telugu News
Shadow

Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్క‌ర‌ను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేష‌న్‌ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబ‌ర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67ల‌కు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచ‌దార‌ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి మ‌నోహర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేద‌ల‌కు సబ్సిడీ ధ‌ర‌కు కందిప‌ప్పు చెక్క‌ర అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, బ‌య‌ట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్ర‌స్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర‌ ధర రూ.45కి పైగా ఉంది.

కొత్తగా సబ్సిడీ ధ‌ర‌ల‌కు స‌రుకులు (Subsidary Groceries)  ఇస్తుండ‌డంతో రాష్ట్రంలో 4.30 కోట్ల మందికి ప్ర‌యోజ‌నం చేకూరుతుందని మంత్రి మ‌నోహ‌ర్‌ వెల్లడించారు. వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుదారుల‌కు రాగులు, ఇతర చిరుధాన్యాల‌ను పంపిణీ చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు గత ప్రభుత్వం బస్తాల్లో రేషన్ షాపులకు కందిపప్పు, పంచదార పంపించేదని.. ఇప్పుడు జీఎస్టీ అదనపు భారమైనా ప్యాకింగ్ చేసి నాణ్యమైన సరుకులను అంద‌జేస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

READ MORE  Tirumala | ఏప్రిల్‌లో తిరుపత వెళ్తున్నారా? ఈ తేదీలను గమనించండి!

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్