Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగబడింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రధాన నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలయినట్లు వార్తలు వెలువడుతున్నాయి..
మంగళవారం సాయంత్రం అమెరికా దీని గురించి ముందుగానే హెచ్చరించింది. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ సిద్ధమవుతోందని అమెరికా అధికారులు అలెర్ట్ చేశారు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడికి ఇరాన్ ప్రయత్నిస్తున్నట్లు అమెరికాకు సంకేతాలు అందాయని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు ‘AFP’కి తెలిపారు. ఈ దాడి నుంచి ఇజ్రాయెల్‌ను రక్షించడానికి మేము రక్షణాత్మక సన్నాహాలను చేస్తున్నామని అమెరికన్ అధికారి తెలిపారు. కొన్ని నెలల క్రితం కూడా, అమెరికా, దాని ఇతర పశ్చిమ మిత్రదేశాలు ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులలో ఇజ్రాయెల్‌కు సహాయం చేశాయి.
కాగా లెబనాన్‌లోని పౌరులపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి టెల్ అవీవ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా వెల్లడించింది. ఈ ఆపరేషన్‌ను తమ చీఫ్ హసన్ నస్రల్లాకు అంకితం చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
ఇజ్రాయెల్ ఏం చెప్పింది?
ఇరాన్ దాడి బెదిరింపుల తర్వాత ఇజ్రాయెల్ కూడా అప్రమత్తమైంది. ప్రస్తుతం ఇరాన్ నుంచి ఎలాంటి వైమానిక దాడుల ముప్పు లేదని, అయితే తమ రక్షణకు ప్రతిదాడికి మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఇంతలో, టెల్ అవీవ్ సమీపంలోని వైమానిక స్థావరంపై క్షిపణి దాడి చేసినట్లు హిజ్బుల్లా తెలిపింది.మీడియా నివేదికల ప్రకారం, టెల్ అవీవ్ శివార్లలో ఉన్న సెడ్ డోవ్ ఎయిర్‌బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు హిజ్బుల్లా పేర్కొంది.
ఇజ్రాయెల్ మిలిటరీ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ, ‘మేము గతంలో ఇటువంటి బెదిరింపులను గట్టిగా ఎదుర్కొన్నాము. భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటాం. ఇలాంటి దాడులను ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా సిద్ధమైంది. మిత్రదేశమైన అమెరికాతో కలిసి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇరాన్‌లో జరుగుతున్న పరిణామాలపై నిఘా ఉంచాం. అదే సమయంలో, లెబనాన్ భూభాగం నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత్ పౌరులకు సలహా జారీ
Israel-Iran Tension Row : ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది. అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. అనవసర ప్రయాణాన్ని నివారించాలని, సురక్షితమైన ప్రాంతాల్లో ఆశ్రయంపొందాలని సూచించింది. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో, మీరు ఈ హెల్ప్‌లైన్‌లు +972-547520711, +972-543278392 హెల్ప్‌లైన్ నంబ్లను సంప్రదించవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..