Saturday, January 31"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: NDA

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్​డీఏ..

Elections
Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశ‌గా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బ‌ద్ద‌లుక కొట్టేలా క‌నిపించింది.రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని కూటమి కేవలం 28 సీట్లకే పరిమితమైంది.2025 అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ రెండు దశల్లో పోలింగ్ జ‌రిగింది. మొదటి దశ నవంబర్ 6న, రెండో దశ నవంబర్ 11న జరిగింది. ఈ సంవత్సరం ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు వేశారు. ఎన్నికల సంఘం ప్రకారం, మొదటి దశలో 65.08 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు...
2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date

2 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. నవంబర్ 14న ఫలితాలు – Bihar Election 2025 Date

Elections
Bihar Election 2025 Date : బీహార్‌లో ఎన్నికల న‌గారా మోగింది. ఈరోజు భారత ఎన్నికల సంఘం దేశ రాజధాని ఢిల్లీలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. బీహార్‌లో ఎన్నికలు రెండు దశల్లో జరుగుతాయి. బీహార్ అసెంబ్లీలో EVMలలో అభ్యర్థుల క‌ల‌ర్ ఫొటోలు ప్ర‌చురించ‌డం ఇదే మొదటిసారి. గతంలో, ఇవి నలుపు మరియు తెలుపు రంగులో ఉండేవి.బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల తేదీలు ప్రకటించారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ గురువారం, నవంబర్ 6, 2025న, రెండవ దశ మంగళవారం, నవంబర్ 11, 2025న జరుగుతుంది. మొదటి దశలో మొత్తం 121 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, రెండవ దశ మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు జరుగుతుంది. ఫలితాలు ఆదివారం, నవంబర్ 14న ప్రకటిం...
‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

‘లవ్ జిహాద్’ కు వ్యతిరేకంగా చట్టాలు? మ‌హారాష్ట్ర‌లో ఏడుగురు సభ్యుల ప్యానెల్ ఏర్పాటు

Trending News
Mumbai: మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లోని మ‌హాయుతి ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులు, "లవ్ జిహాద్ (Love Jihad)" కేసులకు వ్యతిరేకంగా చట్టపరమైన చట్రాన్ని పరిశీలించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం శనివారం ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) సంజయ్ వర్మ నేతృత్వంలోని ఈ కమిటీలో స్త్రీ, శిశు సంక్షేమం, మైనారిటీ వ్యవహారాలు, న్యాయవ్యవస్థ (law and judiciary), సామాజిక న్యాయం (సోష‌ల్ జ‌స్టిస్‌), హోం శాఖ‌ వంటి కీలక విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ క‌మిటీలో ఉంటారు.శుక్రవారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం ప్రకారం, ఈ కమిటీ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేస్తుంది. "లవ్ జిహాద్‌", బలవంతపు మతమార్పిడుల ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలను సూచిస్తుంది. ఈ కమిటీ చట్టపరమైన అంశాలను, ఇతర రాష్ట్రాల్లో రూపొందించిన చట్టాలను కూడా...
జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?

Elections
Jharkhand Election Result 2024: జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నేతృత్వంలోని NDA ? లేదా JMM నేతృత్వంలోని INDI కూటమా అనేది మ‌రికొన్ని గంట‌ల్లోనే తేలిపోనుంది. శనివారం కీలకమైన "బ్యాలెట్ల యుద్ధం" కోసం వేదిక సిద్ధమైంది . పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రెండ్‌లు, ఫలితాలు ఉదయం 9 గంటలకు ఒక అంచనాకు వ‌స్తాయి. ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.74% ఓటింగ్ నమోదైంది, నవంబర్ 15, 2000న జార్ఖండ్ ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా ఈ కీలక పోటీలో ప్రజల భాగస్వామ్యం పెరిగింది."నవంబర్ 23న కౌంటింగ్ కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించారు. పోస్టల్ బ్యాలెట్ల నిష్పక్షపాతంగా లెక్కించడానికి ప్రతి టేబుల్‌కు ARO ఉంటారు. అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.ఓట్ల లెక్కింపు ప్...
Budget 2024 |  కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Budget 2024 | కేంద్ర బడ్జెట్ లో విద్య, ఉపాధి నైపుణ్యాభివృద్ధికి భారీగా కేటాయింపులు

Business
Budget 2024 | ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి  అనేక కీలకమైన అంశాలనుఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు.  మంగళవారం 2024-25 బడ్జెట్‌లో యువత విద్య, ఉపాధి, నైపుణ్యం కోసం రూ. 1.48 ట్రిలియన్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గతంలో కేటాయించిన రూ.1.13 లక్షల కోట్లతో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం ఎక్కువ. కాగా తన ఏడవ బడ్జెట్ ప్రసంగంలో సీతారామన్ మాట్లాడుతూ, బడ్జెట్ ఉపాధి, నైపుణ్యం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME),  మధ్యతరగతి పరిశ్రమల ప్రగతిపై  దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఉత్పాదకత, ఉద్యోగాలు, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, సంస్కరణలు బడ్జెట్‌లోని తొమ్మిది ప్రాధాన్యతలను ఆమె పేర్కొన్నారు.సీతారామన్ ఉపాధి, నైపుణ్యం కోసం మొత్తం 2 ట్రిలియన్ రూపాయలతో ఐదు పథకాలను కూడా ప్రకటించారు. దేశంలో ఉద్యోగాలు, నైపుణ్యం ప్రధాన అంశాలని, వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల మం...
ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

ప్రపంచంలోని 3వ అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్‌గా భార‌త్

National
India Aviation Market | న్యూఢిల్లీ: ఏవియేషన్ రంగంలో భార‌త్ ఆకాశ‌మే హ‌ద్దుగా దూసుకుపోతోంది. గత దశాబ్దంలో వేగవంత‌మైన అభివృద్ధి కారణంగా ఇప్పుడు ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశీయ ఎయిర్‌లైన్ మార్కెట్‌గా నిలిచింది. ఇది 10 సంవత్సరాల క్రితం భార‌త్‌ 5వ స్థానంలో ఉండేది. పది సంవత్సరాల క్రితం, భారతదేశం దాదాపు 8 మిలియన్ సీట్లతో చిన్న మార్కెట్‌గా ఉంది. ఇండోనేషియా 4వ స్థానంలో, బ్రెజిల్ 3వ స్థానంలో ఉంది. US మరియు చైనా మొదటి రెండు స్థానాలను ఆక్రమించాయి. నేడు, యుఎస్, చైనా అతిపెద్ద దేశీయ విమానయాన మార్కెట్లుగా కొన‌సాగుతున్నాయి."అయితే, భారతదేశం బ్రెజిలియన్, ఇండోనేషియా దేశీయ మార్కెట్‌లను ప‌క్క‌కు నెట్టి ఏప్రిల్ 2024లో 15.6 మిలియన్ సీట్ల ఎయిర్‌లైన్ సామర్థ్యంతో మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్‌గా అవతరిస్తోంది" అని OAG డేటా తెలిపింది. 10-సంవత్సరాల సగటు కంటే దేశీయ విమాన‌యాన‌ సీట్ల సామర్థ్యం వృద్ధి రేటు అత్యధికంగా ఉంది....
Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

Lok Sabha Speaker | లోక్ సభ స్పీకర్ ఎన్నిక 26న

National
Lok Sabha Speaker election : లోక్‌సభ ఎన్నికల తర్వాత మొదటి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జూన్ 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే స్పీకర్ అభ్య‌ర్థిని ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోవడంతో ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 24 నుంచి జూలై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి పార్లమెంట్ సమావేశాలు జూన్ 24 నుంచి జూలై 3 వరకు జరుగుతాయని కొత్తగా చేరిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు తెలిపారు. రిజిజు ప్రకారం, సెషన్‌లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన నాయకులు ప్రమాణ స్వీకారం చేయడం.. లోక్‌సభలో వారి సభ్యత్వాన్ని ధృవీకరించడం, సభ స్పీకర్‌ను ఎన్నుకోవడం జ‌రుగుతుంది. జూలై 3న సెషన్‌ ముగుస్తుంది. జూన్ 27న రాష్ట్రపతి ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని భావిస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మా...
Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

Modi 3 Cabinet Ministers List | మోదీ మంత్రి వర్గంలో చేరిన సభ్యుల పూర్తి జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi 3 Cabinet Ministers List | : నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014, 2019లో మాదిరిగానే రాష్ట్రపతి భవన్ ఎదుట అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. మోదీతో పాటు, కూటమి భాగస్వామ్య సభ్యులతో సహా NDA నాయకులు కూడా కేబినెట్, మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) 240 సీట్లు గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే, 272 పూర్తి మెజారిటీని సాధించలేకపోవ‌డంతో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌తో కలిసి 292 సీట్ల‌తో కాషాయ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. నారా చంద్రబాబు నాయుడుకు చెందిన తెలుగుదేశం పార్టీ (టిడిపి), నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్), ఏక్నాథ్ షిండే శివసేన, చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ (LJP), జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) ఇతర కూటమి సభ్యుల మద్దతుతో. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రూపుదిద్దు...
Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

Modi Oath Ceremony : ప్రధాని మోదీ తోపాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే నేతల జాబితా ఇదే..

National, తాజా వార్తలు
Modi Oath Ceremony Live : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి కొన్ని గంటల ముందు,బీజేపీ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలను దేశ రాజధానిలోని ప్రధానమంత్రి ఇంటికి  తేనీటి విందుకు ఆహ్వానం అందింది. వీరిలో ఎక్కువ మంది సభ్యులు ప్రధానమంత్రి మంత్రివర్గంలో చేరి ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, రాజ్‌నాథ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జేడీ(ఎస్) నేతలు హెచ్‌డీ కుమారస్వామి వంటి సీనియర్ నేతలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్న ఎంపీల జాబితానితిన్ గడ్కరీ (మ‌హారాష్ట్ర ) రాజ్‌నాథ్ సింగ్ (ఉత్త‌ర‌ప్ర‌దేశ్) పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా కిరణ్ రిజిజు హెచ్‌డి కుమారస్వామి (క‌ర్నాట‌క‌) చిరాగ్ పాశ్వాన్ (బిహార్‌) రామ్ నాథ్ ఠాకూర్ జితన్ రామ్ మాంజీ జయంత్ చౌదరి అనుప్రియా పటేల్ ప్రతాప్ రావ్ జాదవ్ (SS)...
Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

Modi 3 cabinet | మోదీ మంత్రి వర్గంలో మిత్రపక్షాల నుంచి వీరికి ఛాన్స్ వస్తుందా?

National, తాజా వార్తలు
Modi 3 cabinet | బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) అధినేత నరేంద్ర మోదీ ( Narendra Modi) ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అయిన రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు.అయితే మొత్తం మంత్రి మండలి ప్రమాణస్వీకారం చేయనప్పటికీ. మొద‌ట దాదాపు 30 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రి మండలి మొత్తం బలం 78 నుంచి 81 మంది సభ్యుల మధ్య ఉండవచ్చని అంచనా.ప్రధానమంత్రి నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ఎన్నికైన నేపథ్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)కి చెందిన పలువురు కీలక మిత్రపక్షాలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త మంత్రివ‌ర్గంలో మిత్ర‌ప‌క్షాల‌కు కూడా పెద్ద‌పీట వేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. తెలుగుద...