పేదలకు గుడ్ న్యూస్.. భారత్ బ్రాండ్ తో సబ్సిడీ గోధుమ పిండి, బియ్యం విక్రయాలు ప్రారంభం..
Bharat brand wheat flour | నిత్యావసర వస్తువులు ఆకాశాన్నంటిన వేళ అధిక ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం మంగళవారం 2వ దశ కింద భారత్ బ్రాండ్ కింద సబ్సిడీ ధరలకు గోధుమ పిండి (Bharat brand wheat flour) , బియ్యం (Rice subsidy) రిటైల్ విక్రయాలను ప్రారంభించింది. ఎన్‌సిసిఎఫ్, నాఫెడ్, కేంద్రీయ భండార్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గోధుమ పిండి (అట్టా) కిలో రూ.30, బియ్యాన్ని 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో కిలో రూ.34 చొప్పున విక్రయించనున్నారు.
ఈ సహకార సంఘాల మొబైల్ వ్యాన్‌లను ఫ్లాగ్‌ఆఫ్ చేసిన అనంతరం ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి (Food Minister Pralhad Joshi) మాట్లాడుతూ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సబ్సిడీ ధరలకు గోధుమ పిండి, బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు.
3 లక్షల టన్నుల గోధుమలు
ధరల స్థిరీకరణ నిధి కింద ఫేజ్-2 రిటైల్ కోసం ప్రభుత్వం ఫుడ్...