
కౌలు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..! వీరి కోసం కొత్త పథకాల రూపకల్ప!?
New Schemes For Tenant Farmers | కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) రుణ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలపై పరిమితిని పెంచడానికి, అలాగే ఆత్మనిర్భర్ నిధి (PM-SVANIdhi) తరహాలో కౌలు రైతుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది.గత నెలలో జరిగిన CII ఫైనాన్సింగ్ 3.0 సమ్మిట్‌లో ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి MP తంగిరాల మాట్లాడుతూ, “మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితులను పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998లో రైతులకు వారి వ్యవసాయ పనుల కోసం సకాలంలో రుణాన్ని అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రవేశపెట్టారు. 1998లో ప్రారంభమైన ఈ పథకం గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు. కేసీస...